సూపర్ స్టార్ కృష్ణ మల్టీస్టారర్ ట్రెండ్ ని కొనసాగించారు. తనకు సోలో హీరోగా ఎంత క్రేజ్ వచ్చినా సరే తన సీనియర్ హీరోలు ఎన్.టి.ఆర్, ఏయన్నార్ లతో కలిసి నటించారు. అంతేకాదు తనతో సమకాలీనులుగా ఉన్న శోభన్ బాబు, కృష్ణం రాజు తో కూడా కలిసి సినిమాలు చేశారు. తెలుగు సినిమాల్లో 300 పైగా నటించిన హీరోలు ఇద్దరే.. అందులో ఒకరు ఎన్.టి.ఆర్ కాగా మరొకరు కృష్ణ. సినిమాలతో ఎంత పోటీ పడినా తాను ఎన్.టి.ఆర్ అభిమానిని అని చెప్పుకుంటారు కృష్ణ.
అప్పటికే ఎన్.టి.ఆర్ పెద్ద హీరోగా కాగా తనకు సినిమాల్లో నటించాలని ఉందని ఎన్.టి.ఆర్ కోసం మద్రాస్ వెళ్లి కలిశారు కృష్ణ. ఆ టైం లో నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి మరో మూడేళ్లు తర్వాత రమ్మని ఎన్.టి.ఆర్ చెప్పారట. ఇక ఆ తర్వాత తేనే మనసులు ఛాన్స్ రావడం అప్పటి నుంచి కృష్ణ వరుస సినిమాల్లో నటించడం జరిగింది.
ఎన్.టి.ఆర్ తో కృష్ణ ఐదు సినిమాలు చేశారు. అందులో కృష్ణ నిర్మించిన దేవుడు చేసిన మనుషులు కూడా ఉంది. ఎన్.టి.ఆర్, కృష్ణ నటించిన మొదటి సినిమా స్త్రీ జన్మ. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి తమ్ముడి పాత్రలో కృష్ణ నటించారు. ఆ తర్వాత నిలువు దోపిడి.. విచిత్ర కుటుంబం సినిమాల్లో కూడా ఎన్.టి.ఆర్ తో కృష్ణ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
తనకు స్టార్ ఇమేజ్ వచ్చాక ఎన్.టి.ఆర్ తో కలిసి నటిస్తూ సినిమా నిర్మించారు కృష్ణ. అదే దేవుడు చేసిన మనుషులు. సి రామచంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాని కృష్ణ నిర్మించారు. సినిమాలో ఎన్.టి.ఆర్ కి ఈక్వల్ గా కృష్ణ నటించారు. తెర మీద పోటాపోటీగా నటించి సినిమా సూపర్ హిట్ లో భాగమయ్యారు.
సినిమాలతో ఎంత పోటీ పడినా సరే ఎన్.టి.ఆర్ ఎప్పటికీ తన అభిమాన హీరో అని కృష్ణ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. ఎన్.టి.ఆర్ చేసిన జయ సింహా సినిమా చూసి ఆ సినిమా పాటల పుస్తకం వెనక ఎన్.టి.ఆర్ నెక్స్ట్ సినిమా అల్లూరి సీతారామ రాజు అని ప్రకటన చూసి అప్పుడే ఆ సినిమా మీద ఓ ఆసక్తి ఏర్పరచుకున్నారట కృష్ణ.
ఈ విషయాన్ని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్.టి.ఆర్ అల్లూరి సీతారామ రాజు సినిమా చేయాలా వద్దా అని అనుకుంటున్న టైం లో సినిమా తీసి బంపర్ హిట్ కొట్టారు కృష్ణ. ఆ సినిమా చూసిన ఎన్.టి.ఆర్ సూపర్ స్టార్ కృష్ణని ప్రత్యేకంగా అభినందించారు కూడా. ఎన్.టి.ఆర్ పార్టీ పెట్టిన టైం లో కూడా ఇండస్ట్రీ అంతా ఆయనకు సపోర్ట్ గా ఉంటే కృష్ణ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. అంతేకాదు ఎన్.టి.ఆర్ కి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు కూడా చేశారు కృష్ణ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.