సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా గీత గోవిందం చిత్ర దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఒక సాంగ్ మినహా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఆ సాంగ్ చిత్రీకరణ కూడా ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి.
సర్కారు వారి పాట సినిమా కు క్లాప్ పడి చాలా కాలం అయ్యింది. కరోనా వల్ల సినిమా షూటింగ్ సాఫీగా సాగలేదు. అవకాశం ఉన్నప్పుడు కూడా స్పీడ్ గా చిత్రీకరణ చేయకుండా తాపీగా చేశారు. మహేష్ బాబు మరియు పరశురామ్ ఇద్దరు కూడా మెల్లగా చేద్దాం.. చూద్దాం అన్నట్లుగా ఇన్నాళ్లు సాగతీస్తూ వచ్చారు. మొన్నటి వరకు విడుదల తేదీకి ఇంకా చాలా సమయం ఉంది కనుక మెల్లగా చేద్దాం అనుకున్నారు.
మే 12వ తారీకు సినిమాను విడుదల చేయాల్సి ఉంది. ఇప్పుడు కనీసం మూడు వారాల సమయం కూడా లేదు. ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉంది... పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అవ్వలేదు. దాంతో చిత్ర యూనిట్ సభ్యుల్లో ఆందోళన మొదలు అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో సినిమా వాయిదా వేసే అవకాశాలు లేవు. ఒక వేళ వాయిదా అంటూ వేస్తే మళ్లీ డేట్ కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుంది.
అందుకే విడుదల తేదీ విషయంలో మార్పు ఉండదు. అయితే హడావిడిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను ముగిస్తారట. ఇంకా ట్రైలర్ కట్టింగ్ కు సంబంధించిన వర్క్ కూడా పెండింగ్ ఉందట. ఆ పని ఎప్పుడు ఉంటుందో చూడాలి. మొత్తానికి ఇన్నాళ్లు తాపీగా సర్కారు వారి పాట సినిమాను జరుపుతూ వచ్చిన మేకర్స్ ఇప్పుడు హడావిడిగా ఆగం ఆగం అన్నట్లుగా వర్క్ జరుగుతుందా అంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గీత గోవిందం సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చిన పరశురామ్ కు ఈ సినిమా ఒక అద్బుతమైన అవకాశం అనడం లో సందేహ లేదు. అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమా తో రెండున్నర సంవత్సరాల క్రితం బ్లాక్ బస్టర్ ను దక్కించుకున్న మహేష్ బాబుకు ఈ సినిమా సక్సెస్ కూడా చాలా కీలకం. ఈ సినిమా లో కీర్తి సురేష్ నటించడం వల్ల అంచనాలు మరింతగా ఉన్నాయి.
ఒక విభిన్నమైన బ్యాంకింగ్ రంగంకు చెందిన కమర్షియల్ ఎంటర్ టైనర్ కథతో ఈ సినిమాను రూపొందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది మొదలు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. తమన్ అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ఇప్పటికే విడుదల అయిన రెండు పాటలు సినిమా పై ఆసక్తి పెంచడం లో సఫలం అయ్యాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమా సమ్మర్ కు మహేష్ బాబు అభిమానులకు మంచి గిఫ్ట్ గా నిలువబోతుందేమో చూడాలి.