సూపర్ స్టార్ మహేష్ - వంశీ పైడిపల్లి కాంబో మూవీ ప్రస్తుతానికి సందిగ్ధంలో పడిన సంగతి తెలిసిందే. స్క్రిప్టు నచ్చలేదని అందులో మహేష్ మార్పులు సూచించారని ప్రచారమైంది. పర్ఫెక్షన్ వచ్చాకే ముందుకెళ్లాలని సంకేతాలు ఇవ్వడంతో తాత్కాలికంగా ప్రాజెక్ట్ పక్కనపెట్టినట్లు ప్రచారం సాగుతోంది. అధికారికంగా అనౌన్స్ మెంట్ ఇచ్చిన తర్వాత ఇలా పక్కన పెట్టేయడం వెనుక ఇంకా చాలా కారణాలే ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. కారణాలు ఏవైనా మహేష్ కోసమే వంశీ వెయిట్ చేస్తున్నారు తప్ప మరో హీరో జోలికి వెళ్లలేదు. మహర్షి దగ్గర నుంచి మహేష్ ని అంటిపెట్టుకునే తిరిగాడు. ఆ సింపథీ అయినా మహేష్ కి లేదేమిటో అన్న విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ విషయం పక్కనబెడితే తాజాగా వంశీ ఇప్పుడు మెగా కాపౌండ్ లో చరణ్ పంచన చేరుతున్నాడనే వార్త వేడెక్కిస్తోంది. ఇటీవలే వంశీ...రామ్ చరణ్ ని కలిసాడుట. చరణ్ లాక్ చేసిన మలయాళం సినిమా `లూసీఫర్` రీమేక్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ తనకు ఇవ్వమ్మని అడుగుతున్నట్లు ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో వాడి వేడిగా చర్చకొచ్చింది. అయితే చరణ్ ఇంకా ఏం చేయాలా? అన్నది డిసైడ్ చేయలేదట. ప్రస్తుతానికి ఆ ప్లాన్ ని పెండిగ్ లో పెట్టాడుట. మరి ఈ పెండింగ్ దేనికి అన్నది కొద్ది రోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు. లూసీఫర్ రీమేక్ హక్కులను డాడ్ చిరంజీవి కోసమే చరణ్ చేజిక్కించుకున్నారని తొలి నుంచి ప్రచారం సాగుతూనే ఉంది.
ఇటీవల విక్టరీ వెంకటేష్ హీరోగా కొణిదెల బ్యానర్ లో ఓ సినిమాని నిర్మించేందుకు చరణ్ ఒప్పందం చేసుకున్న సంగతి విదితమే. లూసీఫర్ రీమేక్ ని వెంకీతో తెరకెక్కించే ఛాన్స్ ఉందని ప్రచారం సాగింది. ఇలాంటి సమయంలో చిరు- వెంకీ మధ్యలో వంశీ ఎంట్రీ కారణంగా లూసీఫర్ కాంబినేషన్ ఎలా కుదిరింది? అన్నది పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.
మరి ఇలాంటి డైలమాల నడుమ వీటన్నింటికి ఎలాంటి సొల్యూషన్ దొరుకుతుందో చూడాలి. గతంలో చరణ్ తో వంశీ పైడిపల్లి `ఎవడు` చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చక్కని విజయాన్ని అందుకుంది. అందుకే మరో ఆలోచనే లేకుండా పైడిపల్లి ప్రపోజల్ కి చరణ్ ఓకే చెబుతారని.. రీమేక్ కి ఛాన్సుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.