దళపతి విజయ్ తో వంశీ పైడిపల్లి భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లి కేవలం ఈ ప్రాజెక్ట్ కోసమే వెయిటింగ్ లో ఉన్నాడు. పైడిపల్లికి ఇప్పటికే విజయ్ కాల్షీట్లు ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం విజయ్ పూర్తిగా బీస్ట్ సినిమా పై దృష్టి సారించారు. ఇదిలా ఉండగానే.. పైడిపల్లి తన దృష్టిని వేరొక ప్రాజెక్ట్ పై సారించడం చర్చనీయాంశమైంది.
అతడు సడెన్ గా పూరి `జనగనమణ` టీమ్ తో ప్రత్యక్షమై బిగ్ షాకిచ్చాడు. లైగర్ టీమ్ ప్లాన్ చేసిన జనగనమణ రిలీజ్ తేదీ (2023 ఏర్పిల్ 23)ని కూడా ప్రకటించేసి పూరి మొదలెట్టేశాడు. దీంతో ఈ టీమ్ తో కలిసిపోయిన పైడిపల్లి ఏ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నాడు? అన్న మీమాంశ జనంలో అలానే ఉండిపోయింది. అతడు స్క్రిప్టు రచయితా అంటే కానేకాదు. కేవలం దర్శకుడు మాత్రమే. అంటే దర్శకత్వ శాఖను కోఆర్డినేట్ చేస్తున్నాడా? లేక ఇంకేదైనా పనిలో కుదిరాడా? అంటూ గుసగుస వినిపిస్తోంది.
విజయ్ నటిస్తున్న బీస్ట్ రిలీజై పైడిపల్లితో షెడ్యూల్ కి వస్తే కానీ ఏదీ క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇకపోతే మహేష్ తో కనెక్షన్ ఉన్న పైడిపల్లి పూరి టీమ్ లో చేరి ఎలాంటి స్పై ఆపరేషన్ చేస్తాడోనన్న డౌట్ కూడా ఉంది. అసలే జనగనమణ మహేష్ చేయాల్సిన సినిమా. దీనికి జేజీఎం అంటే మూడక్షరాలతో క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసిన పూరి .. ఛార్మితో కలిసి రణానికి దిగాడు. లైగర్ తర్వాత వెంటనే జనగనమణ కూడా పాన్ ఇండియా ప్రాజక్ట్ నే కావడంతో దీనిపైనా అందరి కళ్లు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో పైడిపల్లి చేరిక కొత్త సమీకరణాలు సందేహాలకు కూడా దారి తీస్తోంది. అన్నిటికీ తర్వాత క్లారిటీనిస్తారేమో చూడాలి.