నాన్నే మోసగాడు : వనితా విజయ్ కుమార్

Update: 2020-12-24 07:24 GMT
‘మా నాన్న మోసం చేశారు.. సంతకం ఫోర్జరీ చేసి సొమ్మంతా కాజేశారు.. నన్ను కూతురుగా ఆదరించలేదు.’ అంటోంది సీనియర్ నటుడు డాటర్ వనిత. నిజానికి విజయ్ కుమార్ ఫ్యామిలీ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. వనితను అప్పట్లో ఇంట్లోంచి బయటకు గెంటేయడం, విజయ్ కుమార్‌ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం.. వనిత మూడు పెళ్లిళ్లు చేసుకోవడం.. వంటి వార్తలు వైరల్ అయ్యాయి.

మరోసారి ప్రేమలో?
వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. ఆ పెళ్లి బంధం తెంచుకోవడం కూడా అంతే వైరల్ అయ్యింది. అంతేకాకుండా..
తాను మరోసారి ప్రేమలోపడ్డానని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. తాజాగా వనిత ఓ చానెల్‌తో మాట్లాడుతూ తండ్రి, ఫ్యామిలీపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

నాన్నపై కేసు వేశాను..
‘మా నాన్న విజయ్ కుమార్ నన్ను కూతురుగా చూడకపోయేవారు. మా అమ్మను కూడా మోసం చేసి, ఆమె సంతకాాన్ని ఫోర్జరీ చేసి, సొమ్మంతా ఆయనే కాజేశారు. అమ్మ చనిపోయాక నాకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఆస్తి మొత్తం మిగతా కుటుంబ సభ్యులకు పంచేశారు. ఈ విషయంపై కోర్టులో కేసు కూడా వేశాను. ఇప్పుడు అన్నీ వదిలేశాను’ అని చెప్పింది వనిత.

నన్ను బెదిరించారు..
‘నన్ను త‌మిళ‌నాడులో లేకుండా చేస్తాన‌ని నాన్న స్వయంగా వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల చేత ఇంటి నుంచి బ‌య‌టకి గెంటేశారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో ఒక సంవ‌త్స‌రం పాటు ఎన్నో కష్టాలు అనుభవించాను. క‌ర్ణాట‌క‌లో ఉంటూ స్నేహితుల సాయంతో చాలారకాల ప‌నులు చేసి మ‌ళ్లీ నిల‌దొక్కుకున్నాను’ అని చెప్పుకొచ్చింది వనిత.

అల్లు అర్జున్‌పై కామెంట్స్..
అల్లు అర్జున్ తనకు లైన్ వేసేవాడంటూ వనిత చెప్పిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చెన్నైలో తెలుగు పరిశ్రమ ఉన్న సమయంలో మెగాస్టార్ ఫ్యామిలీతో తమకు చాలా అనుబంధం ఉండేదని, చిరంజీవి ఇంట్లో జరిగే ఫంక్షన్లకు మా ఫ్యామిలీ మొత్తం వెళ్లే వాళ్లమని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో చిరంజీవి నటించే ఓ సినిమా ఓపెనింగ్‌కు వెళ్లిన సమయంలో అల్లు అర్జున్ తనకు లైన్ వేశాడంటూ వనిత చెప్పుకొచ్చింది.. ఇప్పుడు ఈ వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
Tags:    

Similar News