పదేళ్లలో 45 సినిమాలు.. ఈమెకు మాత్రమే సాధ్యం

Update: 2022-11-14 09:30 GMT
సీనియర్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్‌ కుమార్ కెరీర్ ఆరంభంలో కేవలం రెగ్యులర్ కమర్షియల్‌ హీరోయిన్ పాత్రలకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ ఎప్పుడైతే విలక్షణ పాత్రలు చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుండి సౌత్‌ లో అన్ని భాషలతో పాటు ఉత్తరాదిన కూడా ఈ అమ్మడికి ఆఫర్లు రావడం మొదలు అయ్యింది.

తాను ఒక స్టార్‌ కిడ్‌ ను అనే విషయాన్ని పట్టించుకోకుండా వరలక్ష్మి శరత్‌ కుమార్ అద్భుతమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు దూసుకు పోతుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి అప్పుడే పది సంవత్సరాలు పూర్తి అయ్యింది అంటూ సోషల్‌ మీడియా ద్వారా ఎమోషనల్‌ పోస్ట్ ను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

హీరోయిన్ గా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ చేస్తున్న సినిమాల కంటే కూడా ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా... విలన్‌ పాత్రల్లో ఎక్కువగా నటిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో తెలుగు లో కూడా వరుస సినిమాలకు కమిట్‌ అవుతోంది. క్రాక్‌ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈమె త్వరలో బాలయ్య వీర సింహారెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు అయిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఈ పదేళ్లలో ఏకంగా 45 సినిమాల్లో నటించినట్లుగా చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో ఏ ఒక్క హీరోయిన్‌ కూడా పాతిక నుండి ముప్పై సినిమాలను తన కెరీర్ మొత్తం లో చేసే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని సినిమాల్లో నటించిన వెంటనే ఆ హీరోయిన్స్ పై ఆసక్తి తగ్గుతుంది. కానీ వరలక్ష్మి మాత్రం హాఫ్ సెంచరీ కి దగ్గర అయ్యింది.

నటిగా వరలక్ష్మి శరత్‌ కుమార్ తనను తాను ప్రూవ్‌ చేసుకునేందుకు ఎన్నో ఛాలెంజింగ్‌ సినిమాల్లో నటిస్తూ సినిమాల సంఖ్య పెంచుకుంటూ ఉంది. ఏదో రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తుంది అన్నట్లుగా కాకుండా అన్ని తరహా సినిమాల్లో మరియు పాత్రల్లో వరలక్ష్మి నటించి తన పదేళ్ల సినీ కెరీర్‌ లోనే ఎన్నో మరపురాని జ్ఞాపకాలను వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పదల పర్చుకుంది.

తన సినీ కెరీర్ లో అమ్మ ప్రోత్సాహం తో పాటు ప్రతి ఒక్కరి సహకారం ఉందని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. తన తండ్రి రెండో భార్య అయిన రాధిక ఆంటీ మరియు మా అమ్మ నా నటనపై ఆసక్తిని నాన్నకు చెప్పడం వల్ల ఆయన ఒప్పుకున్నారని.. మొదట ఆయన ఒప్పుకోలేదు అంటూ వరలక్ష్మి పేర్కొంది. వరలక్ష్మి ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుందాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News