గౌత‌మ్ ఎస్ఎస్ఎస్-2లా ఉందేంటి?

Update: 2023-01-05 03:30 GMT
త‌మిళ ప్రేక్ష‌కుల‌తో పాటు తెలుగు వాళ్లు కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ట్రైల‌ర్ రానే వ‌చ్చింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మాణంలో, స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన సంక్రాంతి సినిమా వారసుడు.. ట్రైల‌ర్‌తో ప‌ల‌క‌రించింది.

ఈ ట్రైల‌ర్ చాలా స్టైలిష్‌గా... బాగా క్లాస్‌గా.. కొంచెం మాస్‌గా కూడా అనిపించింది. విజ‌య్ అభిమానులు కోరుకునే ఫ్యాన్ మూమెంట్స్, డైలాగ్స్ అయితే బాగానే ద‌ట్టించారు. దీనికి తోడు ఫ్యామిలీ ఎమోష‌న్లకు కూడా ఢోకా లేక‌పోయింది. కానీ క‌థ ప‌రంగా చూస్తే మాత్రం నిట్టూర్పులే వినిపిస్తున్నాయి.

తెలుగులో ఎన్నో సినిమాల్లో చూసిన ఫార్ములానే ఇందులో క‌నిపించింది. వంశీ పైడిప‌ల్లి తీసినిమా మ‌హ‌ర్షి సినిమా ఛాయలు కూడా లేక‌పోలేదు. ఇంకా త్రివిక్ర‌మ్ సినిమాలు అల‌వైకుంఠ‌పుర‌ములో, అజ్ఞాత‌వాసి, అత్తారింటికి దారేదిల‌ను కూడా ఈ చిత్రం గుర్తు చేసింది.

పై సినిమాల‌తో పోలిక‌లు ఒక‌ర‌క‌మైతే.. క‌థ‌ప‌రంగా న‌వ‌దీప్ హీరోగా న‌టించిన గౌత‌మ్ ఎస్ఎస్సీకి మ‌రీ ద‌గ్గ‌ర‌గా పోలిక‌లుండ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అందులో మాదిరే కుటుంబ పెద్ద త‌న పెద్ద కుమారులు ఇద్ద‌రినీ ఇంట్లో పెట్టుకుని.. చిన్న కొడుకును దూరం పెడ‌తాడు.

కానీ ఆ కుటుంబానికి స‌మ‌స్య‌లు వ‌చ్చి పెద్ద కొడుకులు ఇద్ద‌రూ బ‌య‌టికి వెళ్లిపోతే.. చిన్న కొడుకే వ‌చ్చి స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రిస్తాడు. అచ్చంగా ఇదే స్టోరీ లైన్‌తో వార‌సుడు తెర‌కెక్కిన‌ట్లుగా క‌నిపిస్తోంది. క‌థ ప‌రంగానే కాక మేకింగ్ ప‌రంగానూ చాలా సినిమాల‌తో పోలిక‌లు క‌నిపిస్తుండ‌డంతో వార‌సుడు మీద ఆల్రెడీ ట్రోలింగ్ మొద‌లైపోయింది.

ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లిని ఒక రేంజిలో ఆడేసుకుంటున్నారు. థియేట‌ర్ల గొడ‌వ పుణ్య‌మా అని దిల్ రాజు కూడా బాగానే టార్గెట్ అవుతున్నాడు. త‌మిళ జనాల నుంచి కూడా ఈ ట్రైల‌ర్ విష‌యంలో మిశ్ర‌మ స్పంద‌న క‌నిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News