హీరోకు దర్శకుడికి పాజిటివ్‌ హీరోయిన్‌ కు నెగటివ్‌

Update: 2020-12-04 13:57 GMT
కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్ర షూటింగ్‌ ను జరుపుతున్నారు. మొన్నటి వరకు కరోనా భయంతో షూటింగ్‌ లకు దూరంగా ఉన్న వారు మెల్ల గా షూటింగ్‌ ల్లో జాయిన్‌ అవ్వుతున్నారు. కరోనాను లెక్క చేయకుండా చాలా మంది షూటింగ్‌ ల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో కొన్ని చిత్ర యూనిట్‌ ల్లో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాలు కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయి మళ్లీ పునః ప్రారంభం అయ్యాయి. ఇటీవల బాలీవుడ్‌ మూవీ జగ్‌ జగ్‌ జీయో మూవీ చిత్ర యూనిట్‌ సభ్యులకు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. కరోనా కారణంగా షూటింగ్‌ ను నిలిపేసి వెంటనే యూనిట్‌ సభ్యులు అంతా కూడా స్వీయ నిర్భందంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

వరుణ్‌ ధావన్‌ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో అనీల్‌ కపూర్‌ మరియు నీతూ కపూర్‌ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సినిమాకు రాజ్‌ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో వరుణ్‌.. దర్శకుడు రాజ్‌ మెహత మరియు నీతూ కపూర్‌ లకు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. చండీగఢ్‌ లో షూటింగ్‌ లో జరుగుతున్న సమయంలో యూనిట్‌ సభ్యులు కరోనా బారిన పడ్డట్లుగా సమాచారం అందుతోంది. హీరోయిన్‌ కియారా అద్వానీ కి కరోనా నెగటివ్‌ వచ్చింది. అయినా కూడా ఆమె స్వీయ నిర్భందంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు మరియు హీరో అంతా కూడా కరోనా నుండి పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్‌ పునః ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.
Tags:    

Similar News