మెగా ప్రిన్స్ తెలివైన నిర్ణయం!

Update: 2019-01-18 10:29 GMT
కెరీర్ మొదట్లో కాస్త ఎగుడుదిగుడులు ఫేస్ చేసినా ఫైనల్ గా వరుణ్ తేజ్ కెరీర్ సాఫీగా సాగుతోంది. డిసెంబర్ లో అంతరిక్షం ఝలక్ ఇచ్చినా సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 ఫుల్ కిక్ ఇచ్చింది. వెంకటేష్ డామినేషన్ ఉన్నప్పటికీ తన ఉనికిని బాగానే చాటుకున్నాడు. ఏడాదికో సక్సెస్ తో రిస్క్ లేకుండా దూసుకుపోతున్నాడు. అయితే ఇకపై తొందరపాటు లేకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలనే నాగబాబు సూచన మేరకు ఇప్పటికే కమిట్ అయిన సబ్జెక్ట్ లను మరోసారి విశ్లేషించే పనిలో పడ్డాడట.

నాలుగేళ్ల క్రితం తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన జిగర్ తండా తెలుగు రీమేక్ దర్శకుడు హరీష్ శంకర్ తీయాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోతో సమానంగా ఉండే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఒకటి ఉంది. అది వరుణ్ తో వేయించాలని ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యి ఒప్పించినంత పని చేసాడు. అయితే వరుణ్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. నిజానికి తమిళ్ లో ఈ పాత్ర చేసింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాబీ సింహ. మంచి టాలెంట్ ఉన్న నటుడే అయినప్పటికీ హీరో రేంజ్ కాదు ఇతనిది. ఇదే సినిమా కన్నడ వెర్షన్ లో దాన్ని సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్ చేసాడు.

అంటే ఇది ఫామ్ లో ఉన్న హీరోలు చేయాల్సిన పాత్ర కాదని అర్థమైందిగా. అందుకే వరుణ్ తేజ్ ఆ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకుని దానికి నో చెప్పినట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇది కాకుండా మరో డెబ్యూ డైరెక్టర్ మూవీలో బాక్సర్ గా కనిపించనున్న వరుణ్ తేజ్ కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే విధంగా ముందుకు వెళ్తున్నాడు. తొందరపాటు నిర్ణయాలు ఎలాంటి మూల్యం చెల్లించేలా చేస్తాయో సాయి ధరమ్ తేజ్ రూపంలో చూస్తున్నాడు కాబట్టి కథల ఎంపికలో ఇలాంటి ఆలోచనా ధోరణి చాలా అవసరం


Full View

Tags:    

Similar News