హిందీలో సక్సెస్ అయిన అమితాబచ్చన్ 'పింక్' సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో 'వకీల్ సాబ్' గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి అయ్యింది. సమ్మర్ చివర్లో సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా సినిమాను పూర్తి చేయలేక పోయారు. షూటింగ్స్ పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వకీల్ సాబ్ ఎప్పుడు మొదలు కాబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో దర్శకుడు వేణు శ్రీరామ్ పలు విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెళ్లడి చేశాడు.
వకీల్ సాబ్ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో పలు మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ 'పింక్' రీమేక్ మూల కథను దారి తప్పించే ప్రమాదం ఉందా అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు స్పందిస్తూ... మేము సినిమాను నిజాయితీగా రీమేక్ చేస్తున్నాం. చాలా తక్కువ సీన్స్ మాత్రమే మార్చడం జరిగింది. ఎక్కువ శాతం సీన్స్ ను ఉన్నది ఉన్నట్లుగానే చేస్తున్నామన్నాడు. మూల కథలో ఎలాంటి మార్పు లేకుండానే వకీల్ సాబ్ ను తెరకెక్కిస్తున్నామన్నాడు. డిసెంబర్ వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసి ఫస్ట్ కాపీని సిద్దం చేసేలా ప్లాన్ చేస్తున్నామన్నాడు.
వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నాడు. వకీల్ సాబ్ షూటింగ్ కోసం పవన్ అక్టోబర్ లేదా నవంబర్ లో వచ్చే అవకాశం ఉందట. సినిమాలో అయిదు పాటలు ఉంటాయని ఒకటి రెండు కొత్త పాత్రలు కనిపించడంతో పాటు కొన్ని కమర్షియల్ సీన్స్ ఉంటాయి. అంతకు మించి పింక్ కు తేడా ఏమీ ఉండదన్నట్లుగా పేర్కొన్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్నాడు.