దళపతి విజయ్ ఓ సినిమాలో నటిస్తున్నారు అంటే దానిపై జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. ఆయనకు ఉన్న వరల్డ్ వైడ్ ఫాలోవర్స్ లో పెద్ద డిబేట్ రన్ అవుతుంటుంది. అలాంటిది విజయ్ కెరీర్ 65 వ చిత్రంపై అధికారిక ప్రకటన విడుదలవుతోంది అంటే అంతే ఉత్కంఠ ఉంటుంది.
ఎట్టకేలకు చాలా నెలల ఊహాగానాల తరువాత దళపతి విజయ్ తదుపరి చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువరించారు. ప్రముఖ కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనుండగా.. తమిళ యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. నెల్సన్ ఇంతకుముందు కోకో (నయన్) అనే చిత్రం తెరకెక్కించారు. ప్రస్తుతం డాక్టర్ అనే మరో మూవీని చేస్తున్నారు. నిజానికి ఏ.ఆర్. మురుగదాస్ స్థానంలో నెల్సన్ కి ఈ ఆఫర్ దక్కింది. మురుగ వినిపించిన స్క్రిప్ట్ నచ్చకపోవడంతో నెల్సన్ కి విజయ్ ఆఫర్ ఇచ్చారని సమాచారం.
ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం విజయ్ కెరీర్ లో 65వ సినిమాగా తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను టీజర్ రూపంలో విడుదల చేయగా.. ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని అర్థమవుతోంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ కంపోజ్ చేస్తున్నారు. తారాగణం ఇతర సిబ్బంది గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. విజయ్ నటించిన మాస్టర్ త్వరలో రిలీజ్ కానుంది.

We are happy to announce Thalapathy @actorvijay ’s #Thalapathy65bySunPictures directed by @nelsondilpkumar and music by @anirudhofficial #Thalapathy65 pic.twitter.com/7Gxg1uwy22
— Sun Pictures (@sunpictures) December 10, 2020