లైట్ ఉండగానే హౌస్ చక్కబెట్టుకోవాలనే పాలసీని చాలా సిన్సియర్ గా ఫాలో అవుతున్నాడు అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండ - రెండే రెండు సినిమాలతో భారీగా ఫ్యాన్ ఫాయింగ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కాల్షీట్స్ కోసం నిర్మాతలు క్యూలు కడుతున్నారు. ఏకంగా ఆరు సినిమాలు విజయ్ దేవరకొండ చేతిలో ఉన్నాయంటే ఈ యంగ్ హీరో రేంజ్ ఏ రేంజ్ కి పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిటైన విజయదేవరకొండ - ఆ తరువాత తనకు లైఫ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. దాంతో పాటే వైజయంతి మూవీస్ లో విజయ్ ఓ సినిమా చేసే అవకాశం ఉంది, అలానే మైత్రి మూవీస్ బ్యానర్ లో కూడా ఈ హ్యాపెనింగ్ హీరో ఓ సినిమా కమిటైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సినిమాలు అన్నీ అర్జున్ రెడ్డికి ముందే విజయ్ కమిటైనట్లుగా తెలిసింది. అర్జున్ రెడ్డి తరువాత విజయ్ కి నచ్చిన స్టోరీలు ఇంతవరుకు రాకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు. కానీ కొత్త సినిమాలు కమిట్ అవ్వకుండానే తన ఆదాయం పెంచుకుంటున్నాడట విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి రిలీజ్ కి ముందు కమిటైన ఒక్కో సినిమాకి కోటీ రూపాయలు రెమ్యూనీరేషన్ అడిగిన విజయ్ దేవరకొండ ఇప్పుడు రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో చాలా సినిమాలకి ఎగ్రీమెంట్లు అవ్వకపోవడంతో - విజయ్ అడిగినంత పారితోషికం ఇచ్చి సినిమాలు తీసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నట్లుగా తెలిసింది. మరి విజయ్ పై ఈ అర్జున్ రెడ్డి ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.