లైగర్ కాంబినేషన్ రిపీటవుతోంది. పూరీ జగన్నాథ్- విజయ్ దేవరకొండ జోడీ రెండవసారి కలిసి పని చేస్తున్నారని ఇంతకుముందే కథనాలొచ్చాయి. ఎట్టకేలకు ఈ చిత్రం ముంబైలో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. జనగణమన అనేది టైటిల్. నిజానికి పవన్ లేదా మహేష్ చేయాల్సిన చిత్రమిది. కానీ దేవరకొండను అవకాశం వరించింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో కూడిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ప్రస్తుతం కథానాయిక పూజా హెగ్డేపై యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారు.
తదుపరి దేవరకొండ సెట్స్‌లో జాయిన్ అవుతారని తెలిసింది. మేకర్స్ సెట్స్ నుండి ఒక చిన్న వీడియో బైట్ ను విడుదల చేశారు. పూరి కనెక్ట్స్ -శ్రీకరా స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ కి తగ్గట్టే దేశభక్తి చిత్రం అయిన జనగణమన నిర్మాణ బాధ్యతలను ఛార్మీ కౌర్- పూరితో కలిసి నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ఆగస్టు 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు ప్రకటించారు.
ఇప్పటికే లైగర్ షూటింగ్ ని పూర్తి చేసారు. లైగర్ టీమ్ తో కరణ్ జోహార్ జాయిన అవ్వడంతో అటు హిందీలోనూ అత్యంత భారీగా విడుదల కానుంది. ఇప్పటికే హిందీ బెల్ట్ లో ఈ చిత్రంపై మంచి అంచనాలేర్పడ్డాయి. పూరి మార్క్ ట్రీట్ ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇందులో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ అతిథిగా నటిస్తుండడం బజ్ ని అమాంతం పెంచింది. తెలుగు-తమిళం- హిందీ-మలయాళం-కన్నడం లో ఈ చిత్రం పాన్-ఇండియన్ విడుదలకు సిద్ధమవుతోంది. లైగర్ ఈ ఏడాది ఆగస్ట్ 25 న విడుదల కానున్న సంగతి తెలిసిందే.