అది జనసంచారం లేని నిర్జన ప్రదేశం. అలాంటి చోట `ఐ యామ్ లెజెండ్` లోని విల్ స్మిత్ లా వెయిట్ చేస్తున్నాడు దేవరకొండ. వైరస్ సోకిన దేశంలా చుట్టూ భవంతులు ఉన్నా మనుషుల్లేరు! ఇంతకీ రౌడీ అక్కడ ఎందుకా వెయిటింగ్? అంటే దానికి మునుముందు లైగర్ లో సమాధానమిస్తాడేమో!
ప్రస్తుతానికి ఇది త్రోబ్యాక్ ఫోటో అంటూ అభిమానులు కనిపెట్టేశారు. అయితే ఈ ఫోటో చూస్తుంటే లైగర్ చిత్రీకరణను వేగంగా పూర్తి చేయాలనుకున్న తన కల నెరవేరని కారణాన్ని తలుచుకుని విజయ్ బాధపడుతున్నట్టే అనిపిస్తోంది. ఇది అతడికి తొలి హిందీ స్ట్రెయిట్ రిలీజ్ .. పైగా తనని పాన్ ఇండియా స్టార్ గా మలిచే చిత్రం. అలాంటి కీలకమైన దశలో ఇలా నిర్జన ప్రదేశంలా మారింది వాతావరణం.
ప్రపంచాన్ని ఒణికించిన కోవిడ్ భూతం సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ వెనక్కి వచ్చింది. దేశం రెసిడెంట్ ఈవిల్ లా మారింది. వైరస్ కథతో తెరకెక్కిన `ఐ యామ్ లెజెండ్` హీరోల్లా ఎవరికి వారు ఊహించుకోవాల్సిన పరిస్థితి. భారతదేశంతో పాటు పొరుగు దేశాలు అల్లాడుతున్నాయి. ఇలాంటి సమయంలో పాన్ ఇండియా సినిమాల మనుగడ ఎలా ఉండనుంది? అన్న సందిగ్ధత వ్యక్తమవుతోంది. మరో రెండు నెలల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తయితే అనంతరం అన్ని పరిశ్రమలు గాడిన పడతాయన్న హోప్ అయితే ఉంది. వ్యాక్సినేషన్ తర్వాత మహమ్మారీతో పోరాడే శక్తి వస్తుంది. షూటింగులకు వెళ్లొచ్చు. ఓటీటీల ఆదరణతో థియేట్రికల్ బైపోలార్ రిలీజ్ లకు ఆస్కారం ఉండొచ్చున్న ఆశ కూడా ఉంది.