పెళ్లి చూపులు సక్సెస్ తర్వాత.. విజయ్ దేవరకొండ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. స్థానికంగానే కాదు.. పెళ్లి చూపులు మూవీ యూఎస్ బాక్సాఫీస్ ను కూడా కొల్లగొట్టేయడం.. అక్కడ ఏకంగా 50డేస్ పోస్టర్ పడేవరకూ ఆడ్డం చాలామంది టాలీవుడ్ మూవీ మేకర్స్ కి ఆశ్చర్యం కలిగించింది. ఈ కుర్ర హీరోతో సినిమా చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టేయగా.. వీరిలో భారీ నిర్మాణ సంస్థలు కూడా ఉండడం విశేషం.
ఇప్పటికే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌజ్ లు విజయ్ దేవరకొండకు అడ్వాన్సులు ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్టోరీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాని ఈ హీరో.. ఎంత పెద్ద బ్యానర్ అయినా సరే.. తన పట్టు మాత్రం వదలడం లేదట. ఇప్పటికే అశ్వనీ దత్.. యూవీ క్రియేషన్స్.. సురేష్ బాబు.. సాయి కొర్రపాటి లాంటి బడా నిర్మాతలు కూడా ఈ హీరో అడ్వాన్స్ లు ఇచ్చారని.. త్వరలో ఓ సినిమా స్టార్ట్ చేయనున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం ద్వారక.. అర్జున్ రెడ్డి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్ దేవర కొండ.. ఐదు పెద్ద బడ్జెట్ సినిమాలను ఒప్పేసుకున్నాడంటే.. కుర్రాడి స్పీడ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.