పెళ్లి చూపులు అనే సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి తో ఏకంగా ఏ యంగ్ హీరో అందుకోలేని స్టార్డం సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మరో వైపు యూత్ ఐకాన్ గా ఉంటూ దూసుకుపోతున్నాడు. అయితే కెరీర్ ఆరంభంలో నిర్మాతగా మారి సినిమా చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి తనవైపుకి తిప్పుకున్నాడు.
తనకి హీరోగా లైఫ్ ఇచ్చిన దర్శకుణ్ణి పెట్టి కొత్త దర్శకుడు షబ్బీర్ తో 'మీకు మాత్రమే చెప్తా' అనే సినిమా చేసాడు. అయితే ఈ సినిమా చేయడానికి తన ఉద్దేశ్యం ఏమిటన్నది ఇప్పటికే పలు సార్లు చెప్పుకొచ్చిన రౌడీ మళ్లీ ఆ విషయాన్ని పంచుకున్నాడు. విజయ చెప్పిన ఈ మాటలు విని రౌడీ నువు సూపర్ అంటున్నారు ఫ్యాన్స్.
ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం తను గతంలో అవకాశం కోసం పడిగాపులు గాచినట్టు మరొకరు భాద పడొద్దనేది రౌడీ ఆలోచన. అందుకే తనే హీరోగా తీసుకుంటున్న రెమ్యునరేషన్ లో కొంత ప్రొడక్షన్ హౌజ్ కోసం పక్కన పెట్టి ఇలా ఓ కాన్సెప్ట్ సినిమా చేసాడు. ఇక ఏమిటి నుండో దర్శకుడవ్వాలని చూస్తున్న షబ్బీర్ అనే షార్ట్ ఫిల్మ్ మేకర్ ను ఈ సినిమాతో దర్శకుడిగా మార్చిన ఘనత అందుకున్నాడు. ఇలా తను ఎదిగి మరికొందరికి తన ద్వారా అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలనేది విజయ్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సినిమా హిట్టైయి కొంత రిటర్న్ వస్తే వెంటనే మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.