నిన్ననే విడుదలైన పెళ్లి చూపులు చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ.. రీతూ వర్మ జంటగా నటించారు. ఇప్పటి వరకు షార్ట్ ఫిలిమ్స్ ను మాత్రమే రూపొందించిన తరుణ్ భాస్కర్.. తొలిసారిగా ఓ ఫీల్ గుడ్ ఫుల్ లెంగ్త్ మూవీని తెరకెక్కించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూలను గత రెండు వారాలుగా రామానాయుడు స్టూడియోలో మీడియా వారికి.. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు.. డిస్ట్రిబ్యూటర్లకు చూపించి పాజిటివ్ టాక్ ను తెప్పించుకున్నారు. అలాంటి సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి మంచి మార్కులే వేశారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఎవడే సుబ్రమణ్యం చిత్రం తరువాత తరుణ్ భాస్కర్ నాకు ఫోన్ చేశాడు. అందులో నేను పోషించిన రిషి క్యారెక్టర్ తనకు బాగా నచ్చింది. హైపర్ టెన్షన్ వున్న పాత్రలో నన్ను చూసి.. తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రానికి నువ్వే హీరో అన్నారు. నేను నిజంగా నమ్మలేదు. అయితే కథ వినిపించాడు. నాకు బాగా నచ్చింది. వెంటనే నిర్మాత డి.సురేష్ బాబు వద్దకు తీసుకెళ్లా. ఆయన కూడా కొన్ని మార్పులు చేయమన్నారు. ఆ తరువాత నిర్మాత రాజ్ కందుకూరిని కలవమన్నారు. ఆయన్ను కలిసి స్టోరీ నెరేషన్ చేశాం. ఆయన బాగా ఎగ్జైట్ అయ్యిపోయారు. వెంటనె చేద్దాం అన్నారు. అలా ఈ చిత్రం పట్టాలెక్కింది. ఇందులో నేను పోషించిన ప్రశాంత్ పాత్ర నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో విడుదలైన అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ వస్తోంది’ అన్నారు.
‘మా నాన్న చాలా సీరియల్స్ కి దర్శకత్వం వహించారు. వర్దన్ అంటే.. టెలివిజన్ రంగంలో తెలియని వాళ్లు లేరు. ఆయన ప్రోత్సాహంతోనే నేను థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది యాక్టర్ ను అయ్యా. ఆయన ఈ సినిమా షూటింగ్ కి ప్రతి రోజూ అటెండ్ అయ్యే వారు. ప్రతి సీను చూసి.. నన్ను చాలా బాగా చేశావ్ అని ప్రోత్సహించేవారు. అమ్మా కూడా సినిమా చూసి అప్రిషియేట్ చేసింది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నా. ఒకటి సూపర్ గుడ్ మూవీస్ లో ఓ చిత్రాన్ని.. అర్జున్ రెడ్డి అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నా’ అన్నారు.