ఛిల్ తాతయ్యా.. మళ్ళీ సెటైర్ వేశాడు

Update: 2017-08-30 04:03 GMT
టాలీవుడ్ లేటెస్ట్ హిట్ అర్జున్ రెడ్డి సినిమా ప్రమోషన్ల కోసం వాడిన లిప్ లాక్ పోస్టర్ పై హీరో విజయ్ దేవరకొండ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావుల (వీహెచ్) మధ్య మొదలైన ఇంకా చల్లారలేదు. సరికదా ఎవరి స్టయిల్లో వారు ఎదుటి వాళ్లపై పంచులేస్తూనే ఉన్నారు. అర్జున్ రెడ్డి పోస్టర్లు అసభ్యంగా ఉన్నాయంటూ వీహెచ్ వాటిని చింపేశాడు. దీనికి విజయ్ దేవరకొండ ఛిల్ తాతయ్యా అంటూ రిటార్ట్ ఇవ్వడంతో వివాదం స్టార్ట్ అయింది.

రీసెంట్ గా అర్జున్ రెడ్డి సినిమా బాగుందంటూ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. విజయ్ దేవరకొండ కేటీఆర్ కు దగ్గర బంధువు కాబట్టే అర్జున్ రెడ్డి సినిమాను మెచ్చుకున్నారంటూ వీహెచ్ విమర్శించారు. దీనిపై విజయ్ దేవరకొండ ఈసారి కాస్తంత గట్టిగానే బదులిచ్చారు. అర్జున్ రెడ్డి సినిమాను మెచ్చుకున్న వాళ్లంతా తన రిలేషన్సే అంటూ సెటైరిక్ గా ఫేస్ బుక్ లో ఓ లెటర్ పోస్ట్ చేశాడు. ‘డియర్ తాతయ్యా’ అంటూ సంబోధన నుంచే తనదైన వ్యంగ్యం జోడించాడు. ‘అస్సలే మాత్రం లాజిక్ లేని మీ అద్భుతమైన ఆలోచన ప్రకారం... అర్జున్ రెడ్డి ని అభినందించినందుకే కేటీఆర్ నా బంధువు అయితే గనుక ఎస్.ఎస్.రాజమౌళి నా ఫాదర్ అవుతారు. యాక్టర్లు రానా - నాని - శర్వానంద్ - వరుణ్ తేజ్ బ్రదర్స్ అవుతారు. నాకు సిస్టర్స్ అంటే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సమంత - అను ఇమ్మానుయేల్ - మెహ్రీన్ అంతా మరదళ్లు. ఐదు రోజుల్లో 5 వేల షోస్ ఫుల్ చేసిన స్టూడెంట్స్ ఆడా మగా అందరూ నా ట్విన్స్. ఇంకా రామ్ గోపాల్ వర్మ మనిద్దరిలో ఎవరి ఫాదరో ఇంకా క్లారిటీ రాలేదు. సినిమా అండ్ మైండ్ సెట్ ముందుకు తీసుకెళ్తున్నాం. కొంతమంది ఇంకా తొడగొట్టడం లాంటి రోజుల్లోనే ఆగిపోయారు. ఛిల్ తాతయ్యా’ అంటూ విజయ్ దేవరకొండ తన లెటర్ ముగించాడు.

ఈ వాద వివాదాలెలా ఉన్నా అర్జున్ రెడ్డి థియేటర్ల వద్ద కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు. అన్ని ఏరియాల్లో యూత్ నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తోంది. ఓ రకంగా విజయ్ దేవరకొండ అండ్ వీహెచ్ ల మధ్య నడుస్తున్న వివాదంతో పబ్లిసిటీ పెరిగి ఈ సినిమాకు ఇంకాస్త మేలే చేస్తోంది. మరి విజయ్ దేవరకొండ ఓపెన్ లెటర్ కు వీహెచ్ ఎలా రియాక్ట్ అవుతారో... లెట్స్ వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News