త్వరలోనే తెలుగువారు ఎంతో గర్వించదగిన నటీమణి అయిన మాహానటి సావిత్రి జీవితం వెండితెరపై రాబోతుంది. ''మహానటి'' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో క్యాస్టింగ్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఆల్రెడీ కీర్తి సురేష్ ను సావిత్రిగా.. డల్కర్ సల్మాన్ ను జెమిని గణేశన్ గా మార్చేశాడు డైరక్టర్ నాగ్ అశ్విన్. అయితే తెలుగువారు ఈ సినిమాలో చూసే అతి ముఖ్య పాత్రలు ఎవరివి అంటే.. అసలు ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ రోల్ ఎవరు చేయబోతున్నారనే. గతంలో ఈ పాత్రలను జూ.ఎన్టీఆర్ అలాగే నాగ చైతన్య తిరస్కరించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ పాత్రలను ఎవరు చేస్తున్నారనేది సస్పెన్స్ గా మారింది.
మనకు తెలుస్తున్న టాక్ ఏంటంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ లేదా ఏఎన్నార్ పాత్రలో హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడట. ఆల్రెడీ దర్శకుడు నాగ్ అశ్విన్ గతంలో ఎవడే సుబ్రమణ్యం సినిమాలో విజయ్ తో పనిచేశాడు కాబట్టి.. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రకు అతన్ని తీసుకున్నాడు. అయితే ఇతను చేస్తోంది ఎన్టీఆర్ పాత్రా ఏఎన్నార్ పాత్ర అనేది క్లారిటీ లేదు కాని.. ఎన్టీఆర్ పాత్రనే పోషిస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి తెలుగు ఇండస్ర్టీకే లెజండ్స్ అయిన నటుల్లో ఒకరి పాత్రను వెండితెరపై పోషించడం అంటే పెద్ద ఛాలెంజే. ఇది దర్శకుడికి ఎంత ఛాలెంజో.. ఆ నటుడికి కూడా అంతే ఛాలెంజ్. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఇక్కడ ఉన్న అభిమానసేనలు కత్తులు నూరేస్తాయ్ అంతే.
నిజానికి సావిత్రి జీవిత కథను ఒక బయోపిక్ అనేకంటే.. బయోస్కోప్ లో నుండి మనం చూసే ఒక అతిపెద్ద మల్టీస్టారర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువగా ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీరంగారావు వంటి దిగ్గజ నటులు ఉన్నారు. అలాగే మహామహా దర్శకులు ఉన్నారు. వారందరి పాత్రలనూ ఇప్పుడు తెరపై చూపించాల్సిందే. అందుకే ఇది తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద మల్టీస్టారర్ సినిమా అవుతుంది. కాదంటారా?