విజయ్ న్యూ లుక్ వైరల్

Update: 2023-01-16 04:55 GMT
వారసుడు సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఇళయదళపతి విజయ్ నెక్స్ట్ సినిమా లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇక లోకేష్ యూనివర్స్ లో భాగంగానే ఈ మూవీని అతను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు లోకేష్ యూనివర్స్ లో వచ్చిన సినిమాలలో హీరోలని భిన్నమైన నేపధ్యంలో దర్శకుడు ఆవిష్కరించాడు. అయితే ఈ మూవీలో మాత్రం విజయ్ ని పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

యాక్షన్ థ్రిల్లర్ గానే మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ కి ప్రతినాయకుడుగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్రిష కూడా ఈ మూవీలో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే భారీ మల్టీస్టారర్ గా ఈ మూవీని లోకేష్ కనగరాజ్ తీర్చిదిద్దే పనిలో ఉన్నాడు.

తన యూనివర్స్ కాన్సెప్ట్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాని విక్రమ్, కత్తి సినిమాలకి కొనసాగింపుగా చూపించడానికి లోకేష్ సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా లోకేష్ మూవీలో విజయ్ లుక్ ఎలా ఉండబోతుంది అనేది రివీల్ అయిపొయింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ యాంకర్ తో దిగిన ఫోటోలు షేర్ చేశారు.

ఈ ఫోటోలలో అతను డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, మాసిన గడ్డంతో కనిపించాడు. ఇదే లుక్ లో లోకేష్ సినిమాలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. వారసుడు మూవీ కోసం స్టైలిష్ గా మారిన విజయ్ ఇప్పుడు లోకేష్ సినిమా కోసం లైట్ గా గెడ్డం పెంచి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఫోటో కాస్తా వైరల్ అవుతుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News