ఈ ముగ్గురు ముగ్గురే

Update: 2021-01-07 03:31 GMT
ఒకప్పుడు హీరోలు ఒకే సమయంలో మూడు నాలుగు సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఒక్క ఏడాదిలో స్టార్‌ హీరోల సినిమాలు అయిదు నుండి పది వరకు వచ్చిన సందర్బాలు కూడా ఉన్నాయి. కాని ఇప్పుడు స్టార్‌ హీరోలు ఏడాదికి ఒక్కటి మాత్రమే అన్నట్లుగా ఉన్నారు. చిన్న హీరోలు మాత్రం రెండు మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు కిందా మీదా పడుతున్నారు. కాని ముగ్గురు హీరోల జోరు చూస్తుంటే మాత్రం ఇతర హీరోలు వీళ్లను ఎందుకు ఆదర్శంగా తీసుకోవడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రక్షకులు అంటున్నారు. ఇంతకు ఆ ముగ్గురు ఎవరు అంటే తమిళ హీరోలు విజయ్ సేతుపతి.. ధనుష్‌ ఇంకా మలయాళ హీరో పృథ్వీరాజ్.

ఈ ముగ్గురు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ధనుష్‌ తమిళం.. హిందీ.. ఇంగ్లీష్‌ ఇలా వరుసగా ప్రాజెక్ట్‌ ల మీద ప్రాజెక్ట్‌ లు చేస్తున్నాడు. ఈయన చేతిలో దాదాపుగా డజను ప్రాజెక్ట్‌ లు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఈయన గ్రే మ్యాన్ అనే భారీ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ ను ధనుష్‌ కమిట్‌ అయ్యాడు. మరో వైపు తమిళంలో వరుసగా సినిమాలను చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాదిలో ధనుష్‌ అభిమానులకు పండుగే. ఇక విజయ్‌ సేతుపతి కూడా వరుస సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు. ఈయన కూడా బాలీవుడ్‌ లో సినిమాలు చేస్తున్నాడు.

కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఈయన వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్‌ గా కూడా నటించేందుకు కమిట్‌ అవుతున్నాడు. దాంతో ఈయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల సంఖ్య దాదాపుగా రెండు పదులకు దగ్గర ఉంది. ఇక మలయాళ హీరో పృథ్వీరాజ్‌ కూడా బాలీవుడ్‌ మలయాళ సినిమాలను చేస్తున్నాడు. ఈయన కూడా లెక్కకు మించి కమిట్‌ అయ్యాడు. ఈ ఏడాది వచ్చే ఏడాది కి మాత్రమే కాకుండా ఇంకా ముందు ముందు సంవత్సరాలకు కూడా ఈయన ఇప్పటికే సైన్ చేశాడు అనేది మలయాళ మీడియా వర్గాల టాక్. ఈ ముగ్గురు హీరోల మాదిరిగా ఇతర హీరోలు కూడా ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు చేసినా కూడా ఇండస్ట్రీకి మంచిది అభిమానులకు పండుగ.
Tags:    

Similar News