చాలా సంవత్సరాల తర్వాత నటినటులు రీఎంట్రీ ఇస్తున్నప్పుడు వారి పాత్రలు ఎలా ఉంటాయి.. మునుపటిలా సత్తా చూపగలరా అని ప్రేక్షకుల్లో ఆసక్తి కలగడం సహజమే. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలతో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వారిద్దరే విజయశాంతి.. టబు.
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయశాంతి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా సత్తా చాటి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో పాత్ర పరంగా.. ప్రమోషన్స్ పరంగా విజయశాంతికి మంచి ప్రాధాన్యతే దక్కింది. విజయశాంతి నటించడం 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి ప్లస్ గా మారింది. అయితే ఇది విజయశాంతికి మరపు రాని పాత్ర అని మాత్రం చెప్పలేం. ఓవరాల్ సినిమా మొత్తంగా మీద చూస్తే విజయశాంతికి మంచి రీ ఎంట్రీ దక్కినట్టే. ఫ్యూచర్ లో విజయశాంతికి పవర్ఫుల్ పాత్రలు లభించే అవకాశం అయితే ఉంది.
టబు హిందీలో నటిగా కొనసాగుతూనే ఉంది కానీ తెలుగులో మాత్రం గ్యాప్ వచ్చింది. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాతో టబు టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో టబు పాత్రకు ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. పాత్ర నిడివి కూడా తక్కువే. ఇంట్రడక్షన్ స్పెషల్ గా అనిపించినా కాసేపటికి ఈ సినిమాలో ఉన్న మిగతా క్యారెక్టర్లలో ఒకటిగా అనిపిస్తుంది కానీ టబు పాత్ర స్పెషల్ అని ఏమాత్రం అనిపించదు. టబు అద్భుతమైన నటే కానీ ఇందులో ఆమె నటన ప్రదర్శించే అవకాశం పెద్దగా దక్కలేదు. మరి ఈ సినిమా భవిష్యత్తులో టబు కు ఎలాంటి అవకాశాలు తెచ్చి పెడుతుందో వేచి చూడాలి.