యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత 'విక్రమ్'తో బిగ్ బ్యాంగ్ ఇచ్చారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తన అభిమానులకు ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందించి సెలబ్రేషన్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఈ స్థాయి హిట్ ని ఊహించని కమల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సూర్యకు రోలెక్స్ వాచ్.. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు అత్యంత ఖరీదైన కారు. చిత్ర బృందంలోని డైరెక్షన్ టీమ్ కు బైక్ లు.. ఇలా ప్రతీ ఒక్కరికి గిఫ్ట్ లతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
'విక్రమ్' మూవీతో పవర్ ఫుల్ కంబ్యాక్ ఇచ్చిన కమల్ ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లపై తాజా స్పందించారు. ఈ మూవీ ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్ల వసూళ్లని రాబట్టింది. కేవలం రెండు వారాల్లోనే 'విక్రమ్' ఈ ఘపతపని సాధించడంతో కమల్ హాసన్ హర్షం వ్యక్తం చేయడమే కాకుండా చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్నేళ్లుగా కమల్ ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేదు. పైగా సొంత పార్టీ వ్యవహరాల్లో బిజీగా వుండటం వల్ల సినిమాల వైపుకు రాలేకపోయారు.
ఆయన సినిమా విడుదలై దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో విడుదలైన మూవీ 'విక్రమ్'. ఈ సందర్భంగా కమల్ స్పందిస్తూ 'తాను గతంలో ఈ మొత్తం సంపాదిస్తానని, తనని నటించడానికి వదలాలని చెప్పానని, అయితే ఆ సందర్భంలో తన మాటని ఎవరూ నమ్మలేదన్నారు. ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చింతలేని నాయకుడు మనకు కావాలి. గతంలో నేను రూ. 300 కోట్లు సంపాదిస్తానంటే నా మాట ఎవరూ నమ్మలేదు. నా మాటల్ని అర్థం చేసుకోలేదు కూడా.
'విక్రమ్' వసూళ్లతో నా మాట ఇప్పడు నిజమైంది. ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా. నాకు ఇష్టమైన ఆహారాన్ని తింటా. కుటుంబం, సన్నిహితులకు చేతనైనంత సహాయం చేస్తా..నా దగ్గర వున్న డబ్బు మొత్తం అయిపోయాక ఇవ్వడానికి ఏమీ లేదని చెప్పేస్తా. వేరే వాళ్ల డబ్బుని తీసుకుని పక్కవాళ్లకు సాయం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నేను ఒక మంచి వ్యక్తిగా వుండాలనుకుంటున్నా' అని తెలిపారు కమల్.
'విక్రమ్' సక్సెస్ తో రెట్టించిన ఉత్సాహంలో వున్న కమల్ హాసన్ త్వరలోనూ ఈమూవీకి సీక్వెల్ ని చేయబోతున్నానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. సీక్వెల్ తో 'విక్రమ్'లో రోలెక్స్ గా చిన్న పాత్రలో నటించి సూర్య రుణం తీర్చుకుంటానని ఇప్పటికే వెల్లడించారు కూడా.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఇదిలాఈ వుంటే రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై మరిన్ని చిత్రాలని కూడా నిర్మించాలని కమల్ ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా వుంటే 'విక్రమ్' తమిళ చిత్రాల్లో 2022 లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా నిలవడం విశేషం.