అనుష్కను ఫాలో అవడం మానేశాడు

Update: 2016-01-30 04:11 GMT
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ - బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలను ఇండియా హాటెస్ట్ కపుల్ అనాల్సిందే. మరి హఠాత్తుగా అనుష్క శర్మను.. విరాట్ ఫాలో అవడం మానేశాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లిపోయే ఈ జంట కూడా.. బ్రేకప్ చెప్పేసుకున్నారా అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు బ్రేకప్ ల సీజన్ బాలీవుడ్ లో బాగా నడుస్తోంది. రణ్ బీర్-కత్రినా - ఫరాన్ అక్తర్-అధునా - అర్బాజ్ ఖాన్- మలైకా అరోరాలు ఇలాగే విడిపోయారు. అలాగే వీరు కూడానా అనే చర్చ మొదలైపోయింది.

ఈ ఫాలోయింగ్ రచ్చ పర్సనల్ గా ఫాలో అవడం. అనుష్క శర్మ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను.. విరాట్ అన్ ఫాలో అవడంతో ఈ వార్తలు మొదలయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ అయినంత మాత్రాన.. తన లవర్ ను అన్ ఫాలో చేయడమేంటనే డౌట్ సహజంగానే వస్తుంది ఎవరికైనా. నిజానికి వీరద్దరి మధ్య గొడవ ఏమాత్రం లేదు. విరాట్ కూడా కావాలని అనుష్కను ఫాలో చేయడం మానేయలేదు. కొన్నాళ్లుగా విరాట్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి ఏదో  ప్రాబ్లెమ్ ఎదురవుతోంది.

దానంతట అదే కొన్ని ఎకౌంట్లను అన్ ఫాలో చేసేయడం, ఎక్కువగా విజిట్ చేసే వారిని బ్లాక్ చేసేయడం జరుగుతోంది. మరి అనుష్క కూడా ఇలాగే విరాట్ పేజ్ ని చూస్తుంది కదా. అలా అనుష్క అకౌంట్ ని సిస్టం అన్ ఫాలో చేసేసింది. ఈ విషయం తెలీక చాలామంది కన్ ఫ్యూజ్ అయ్యారు. ఇంత రచ్చ జరుగుతుంటే.. మా మధ్య సమస్యేం లేదని కనీసం ఓ ట్వీట్ అయినా చేయచ్చు కదా ఈ కపుల్! ఫ్యాన్స్ ఫీలవకుండా ఉంటారని.. కనీసం ఆలోచించడం లేదబ్బా వీళ్లు.

Tags:    

Similar News