తమిళనాట ఏ పెద్ద సమస్య తలెత్తినా సరే.. ఫిలిం సెలబ్రెటీలు ఏకమవుతారు. జనాలతో కలిసి సమస్యల మీద పోరాడతారు. పోయినేడాది జల్లికట్టు సమస్య మీద వాళ్లెలా పోరాడారో తెలిసిందే. అలాగే ఇటీవల కావేరీ ఇష్యూ మీద కూడా ఇలాంటి పోరాటమే చేశారు. గతంలోనూ ఇలాంటి పోరాటాలెన్నింట్లోనూ తమిళ సెలబ్రెటీలు పాల్గొన్నారు. కానీ మన దగ్గర ఆ పరిస్థితి ఉండదు. మన సినీ ప్రముఖులు జనం సమస్యల మీద స్పందించడం అరుదు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం మీద స్పందించిన వాళ్లను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. ఈ విషయంలో మన సెలబ్రెటీల తీరు తీవ్ర విమర్శల పాలవుతుండగా.. తమిళ కథానాయకుడైన విశాల్ మన దగ్గరికి వచ్చి ఆ ఇష్యూ మీద మాట్లాడటం విశేషం. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తాను గళం వినిపించడానికి సిద్ధమని విశాల్ ప్రకటించాడు.
తన కొత్త సినిమా ‘అభిమన్యుడు’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన విశాల్.. ప్రత్యేక హోదా అంశం మీద మాట్లాడాడు. ఎవరైనా ఏదైనా హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాల్సిందే అన్నాడు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు మాట నిలబెట్టుకోవాలన్నాడు. విశాల్ తన సినిమా ప్రమోషన్ల కోసమే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ ప్రత్యేక హోదా మీద మాట్లాడాడు. కానీ మన హీరోలు మాత్రం ప్రమోషన్ల కోసం బయటికి వచ్చినా.. మరోదాని కోసం వచ్చినా.. మీడియా వాళ్లు ఆ ఇష్యూను లేవనెత్తినా మాట్లాడరు. కనీసం సోషల్ మీడియాలో ఈ ఉద్యమానికి మద్దతుగా ఒక మెసేజ్ పెట్టడానికి కూడా వెనుకంజే. విశాల్ కూడా తెలుగువాడే. కానీ తమిళగడ్డపై తన ప్రత్యేకత చాటుకున్నాడు. అక్కడ తమిళ నడిగర్ సంఘం కార్యదర్శిగా.. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. సమస్యలపై పోరాడాడు. కానీ ఇక్కడ మనవాళ్ల సంగతి చూస్తే మాత్రం నిట్టూర్చాల్సిందే.