కెరీర్ ఆరంభంలో ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే చేసినా.. తర్వాత రూటు మార్చాడు తెలుగువాడైన తమిళ హీరో విశాల్. కమర్షియల్ అంశాల్ని మిళితం చేస్తూనే విభిన్నమైన సినిమాలు చేసి మెప్పించాడతను. చివరగా గత ఏడాది వచ్చిన విశాల్ సినిమా ‘తుప్పరివాలన్’ (తెలుగులో డిటెక్టివ్) విమర్శకుల ప్రశంసలందుకుంది. ప్రేక్షకాదరణ కూడా పొందింది. ఇప్పుడతను ‘ఇరుంబుతురై’ (తెలుగులో అభిమన్యుడు) అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రం మే 11న రెండు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ వినూత్న ప్రయోగం చేయబోతున్నాడు హీరో కమ్ ప్రొడ్యూసర్ విశాల్.
‘ఇరుంబు తురై’ విడుదల కావడానికి రెండు రోజుల ముందే తమిళ మీడియా వాళ్లకు ఫుటేజ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాడు విశాల్. ఇలా ఫుటేజ్ స్క్రీనింగ్ చేయడం హాలీవుడ్లో ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. సినిమాలోని కీలక సన్నివేశాలు.. వాటికి సంబంధించిన మేకింగ్ తదితర విశేషాలతో ఈ స్క్రీనింగ్ ఉంటుంది. దాదాపు గంట పాటు ఈ స్పెషల్ షో నడుస్తుందట. సినిమా చూసే ముందు ఒక ఫీల్.. మూడ్ క్రియేట్ చేయడానికి ఈ ఫుటేజ్ స్క్రీనింగ్ ఉపకరిస్తుంది. ఇండియాలో ఇలాంటి ప్రమోషన్ కొత్తే. తెలుగు మీడియాకు కూడా ఇలాంటి స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తారేమో చూడాలి. విశాల్ సరసన సమంత నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు పి.ఎస్.మిత్రన్ రూపొందించాడు. సీనియర్ నటుడు అర్జున్ ఇందులో నెగెటివ్ రోల్ చేయడం విశేషం.