పైర‌సీ దెబ్బ‌: `ప‌ందెంకోడి-2` బ్యాన్!

Update: 2018-10-18 07:20 GMT
విశాల్ హీరోగా లింగుస్వామి తెర‌కెక్కించిన `పందెంకోడి -2` నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. `అర‌వింద స‌మేత‌` త‌ర్వాత రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్ ఫ్యాక్ష‌న్‌తో తీసిన సినిమా ఇద‌ని ప్ర‌మోష‌న్స్‌లో చిత్ర‌బృందం ప్ర‌చారం చేసింది. ఆ క్ర‌మంలోనే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఏడు రోజుల పాటు సాగే జాత‌ర‌లో రెండు ఊళ్ల మ‌ధ్య కొట్లాట నేప‌థ్యంలో తీసిన సినిమా ఇద‌ని విశాల్ తెలిపారు. మ‌రికాసేప‌ట్లో రివ్యూలు ఆన్‌లైన్‌లోకి రాబోతున్నాయి.

తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. పందెంకోడి 2 చిత్రానికి త‌మిళ‌నాడు తిరుచ్చిలో రిలీజ్ ప‌రంగా కొన్ని చిక్కులు ఎదుర‌య్యాయ‌ని తెలుస్తోంది. న‌డిగ‌ర‌సంఘం కార్య‌ద‌ర్శిగా, నిర్మాతల మండ‌లి అధ్య‌క్షునిగా విశాల్  పైర‌సీ పై యుద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కూ త‌మిళ్ రాక‌ర్స్ లాంటి ప్ర‌ముఖ పైర‌సీ వెబ్‌సైట్ నిర్వాహ‌కుల‌ పై స‌వాల్ విసిరాడు విశాల్. సైబ‌ర్ క్రైమ్‌తో క‌లిసి దొరికిన‌వాళ్ల‌ను దొరికించుకుని జైళ్ల‌కు పంపించాడు. ఆ క్ర‌మంలోనే విశాల్‌పై పైరేట్‌లు క‌త్తి క‌ట్టారు.

అదంతా ఒక యాంగిల్ అనుకుంటే ... లేటెస్టుగా విశాల్‌తో ఎగ్జిబిట‌ర్ ఆసోసియేష‌న్ గొడ‌వ పెట్టుకోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. నేడు రిలీజ్ సంద‌ర్భంగా విశాల్ అండ్ టీమ్ పైరేట్‌ల‌పై వల వేశారు. ఆ క్ర‌మంలోనే తిరుచ్చి- తాంజోర్ థియేట‌ర్‌లో పైర‌సీకారుల్ని ప‌ట్టుకుని ఆ థియేట‌ర్‌లో ఆట‌ను నిలిపేయించారు. అంతేకాదు తిరుచ్చి ఏరియాలోని 10 థియేట‌ర్ల‌లో ఎక్క‌డా సినిమాలు వేయ‌కూడ‌ద‌ని విశాల్ బృందం సీరియ‌స్‌గా ప్ర‌క‌ట‌న‌లు గుప్పించింది. పైరేట్‌ల‌ను ఎంక‌రేజ్ చేసే ఇలాంటి చోట సినిమాలు ఆడ‌నివ్వ‌మ‌ని ప్ర‌క‌టించారు. దీంతో అస‌లు గొడ‌వ మొద‌లైంది. విశాల్‌కి కౌంట‌ర్‌గా తిరుచ్చి ఏరియాలో 40 థియేట‌ర్ల‌లో ఎగ్జిబిట‌ర్ అసోసియేష‌న్ `పందెంకోడి 2`పై బ్యాన్ విధించింది. కోర్టు చెప్ప‌కుండా నువ్వెలా బ్యాన్ చేస్తావ్‌? అంటూ ఎగ్జిబిట‌ర్లు ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. ఇంత‌కీ ఈ ర‌భ‌స ఏ తీరానికి చేర‌నుందో?
Tags:    

Similar News