యువ హీరో విశ్వక్ సేన్ 'ఈ నగరానికి ఏమైంది' 'ఫలక్ నుమా దాస్' 'హిట్' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం 'పాగల్' అనే సినిమాలో నటిస్తున్నాడు మాస్ కా దాస్. ఈ చిత్రం ద్వారా నరేష్ కొప్పల్లి అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ లో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం విశ్వక్ తన పాత్రకు తగ్గట్టు లుక్ ని కూడా మార్చేసాడు. అయితే ఈ సినిమా స్టోరీ విషయంలో ఫిలిం సర్కిల్స్ లో అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. 'పాగల్' మూవీ టైటిల్ కి తగ్గట్టే.. ఇందులో హీరో బిహేవియర్ వింతగా ఉంటుందట. అంతేకాకుండా ఈ సినిమా స్టోరీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' సినిమాని పోలి ఉంటుందట.
కాగా, 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ - జెనీలియా కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఆరెంజ్' సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. 'ప్రేమికులు జీవితాంతం ప్రేమించుకుంటారనేది అబద్ధం. ఎంత గాఢంగా ప్రేమించుకున్నా అంది కొంతకాలమే ఉంటుందనేది నిజం' అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో హీరో చాలామంది అమ్మాయిల్ని ప్రేమిస్తూ కొన్నాళ్ళకు బ్రేకప్ చెప్తూ ఉంటాడు. అయితే ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ కొన్ని వర్గాల ప్రేక్షకులకి ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. అందుకే ఇప్పటికీ ఈ మూవీ టీవీలో ప్రసారం అయితే మంచి రేటింగ్ తెచ్చుకుంటుంది. 'ఆరెంజ్' సినిమా ఓవర్ బడ్జెట్ కారణంగా ఫ్లాప్ అయింది కానీ.. కథ పరంగా చూసుకుంటే చాలా గొప్ప సినిమా అవ్వాల్సిందని మెగా అభిమానులు అభిప్రాయపడుతుంటారు. అందుకే ఇప్పుడు 'ఆరెంజ్' స్టోరీ లైన్ తోనే 'పాగల్' సినిమా తీస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఫ్యామిలీ అండ్ లేడీ ఆడియెన్స్ మనసు దోచుకోవడానికి 'పాగల్' ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి చరణ్ కి ప్లాప్ ఇచ్చిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మాస్ కా దాస్ కి హిట్ ఇస్తుందేమో చూడాలి.