విశ్వక్ సేన్ కోసం పవర్ ఫుల్ టైటిల్

Update: 2023-06-18 23:25 GMT
యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ లో విశ్వక్ 11వ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. ఇప్పటికే విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు చేయనటువంటి మాస్ క్యారెక్టర్ లో ఎనర్జిటిక్ గా కనిపించబోతున్నాడు.

ఇక గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్ లోనే మూవీ కథ ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబందించిన ఇంటరెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది. మూవీకి టైటిల్ ని ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది. 'లంకల రత్న' అనే పేరుని పెట్టాలని అనుకుంటున్నారంట. ఈ టైటిల్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు.

దీంతో పాటు 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' అనే మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఈ రెండు టైటిల్స్ కూడా సినిమా కంటెంట్ ని బలంగా జనాల్లోకి తీసుకెళ్ళే విధంగానే ఉన్నాయి. సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు లంకల రత్నగా ఉంటుందంట. అందుకే అదే పేరు అయితే భాగా ఎలివేట్ అవుతుందని భావిస్తున్నట్లు టాక్. విశ్వక్ సేన్ కి కూడా ఈ టైటిల్ భాగా కనెక్ట్ అయ్యిందంట.

ఇక గ్యాంగ్ స్టార్ గోదావరి టైటిల్ కూడా బాగుండటంతో ఫైనల్ ఛాయస్ కోసం వెయిట్ చేస్తున్నారంట. ఈ సినిమా నిర్మాణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఆయన కూడా టైటిల్ విషయంలో సలహాలు ఏమైనా ఇస్తారేమో చూడాలి. దాస్ కా దమ్కీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విశ్వక్ నుంచి రాబోతోన్న మూవీ ఇదే కావడం విశేషం.

ఇక ఈ సినిమా షూటింగ్ నెల రోజుల పాటు రాజమండ్రిలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. మూవీ కోసం విశ్వక్ సేన్ గోదావరి స్లాంగ్ మాట్లాడటం కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. ఇప్పటి వరకు విశ్వక్ ఎక్కువగా తెలంగాణ స్లాంగ్ లోనే అన్ని సినిమాలలో సంభాషణలు ఉంటున్నాయి. కృష్ణ చైతన్య మూవీ పక్కా గోదావరి మాస్ రోల్ కాబట్టి అక్కడి స్లాంగ్ ఉండాలని నేర్చుకొని చెబుతున్నట్లు సమాచారం.

Similar News