ఇంటర్వ్యూ: 'సినిమా చూసే అలా మాట్లాడా.. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోను' - విశ్వక్ సేన్
యంగ్ హీరో, 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నరేష్ కొప్పల్లి తెరకెక్కించిన తాజా చిత్రం ''పాగల్''. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - లక్కీ మీడియా బ్యానర్స్ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు (ఆగస్ట్ 14) థియేటర్లలో గ్రాండ్ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో విశ్వక్ మీడియాతో మాట్లాడుతూ పాగల్ విశేషాలు తెలిపారు.
* ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీ మాటలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై ఏమంటారు?
౼ అవును. నేను నా సినిమా ఫస్ట్ కాపీ చూసిన తర్వాతే అలా మాట్లాడాను. ఏ ఒక్క మాటనీ నేను వెనక్కి తీసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా సినిమా చూశాకే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. నిన్న నా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది డైరెక్టర్ ఫ్రెండ్స్ సినిమా చూసి నువ్వు పేరు మార్చుకునే పనిలేదు అన్నారు.
* సినిమా ఎలా ఉంటుంది?
౼ ఫస్ట్ ఐదు నిమిషాల్లో సినిమా ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ అర్ధం అవుతుంది. తల్లీకొడుకుల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించాం. నిజాయతీగా మనం ప్రేమించిన వాళ్లు తిరిగి మనల్ని ప్రేమిస్తారు అని ఈ సినిమాలో అమ్మ పాత్ర కొడుక్కి చెబుతుంది. తన తల్లి చెప్పే మాటతో మళ్ళీ తనని అంతగా ప్రేమించేలా ఎవరు దొరుకుతారని అతను వెతుకుతుంటాడు. ప్రతీ ఒక్కరినీ ఈ సినిమా కదిలించేస్తుంది. ఈ చిత్రాన్ని గుండెల్లో పెట్టుకుంటారు. థియేటర్ నుంచి ఇంటికి వచ్చినా తర్వాత కూడా ఈ సినిమా కోసం చెప్పకుండా ఉండలేరు ఇది మాత్రం కచ్చితంగా చెప్పగలను.
* మూవీ ప్రమోషన్స్ కోసం బాగా కష్టపడుతున్నట్టున్నారు?
౼ తప్పదు కదండీ. చాలా కష్టపడి తీసిన సినిమా. యాక్టర్స్ టెక్నిషియన్స్ అందరం స్టోరీ కి కనెక్ట్ అయి ఈ సినిమా చేశాం. ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం కదిలిస్తుందనే నమ్మకంతో ఉన్నాం.
* దిల్ రాజు పై ప్రెజర్ తీసుకురావడానికి కారణం ఏంటి? ఓటీటీలో రిలీజ్ చేస్తారనా..?
౼ ప్రెజర్ అని కాదు కానీ, నన్ను నమ్ముకొని చాలా మంది వచ్చారు. సినిమా చూశాక నాకు నచ్చకపోతే నేనేమీ అనను కానీ.. సినిమా చాలా బాగా వచ్చింది. దీన్ని టీవీలో ఒక్కడినే చూసుకుంటే బాగుందడు. అందుకే థియేటర్స్ లోనే రిలీజ్ చేపించాలని రాజు గారిని ప్రెజర్ చేశాను. రేపు సినిమా చూస్తే ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాం అన్నది మీకు తెలుస్తుంది.
* 'ఫలక్ నామా దాస్' 'హిట్' సినిమాలతో పోలిస్తే ఇందులో ఎమోషన్ కాస్త తగ్గినట్టు ఉంది?
౼ ఈ సినిమాలోనూ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ట్రైలర్ చివర్లో ఎమోషన్ ఎలా ఉందో.. సినిమాలో లాస్ట్ 30 మినిట్స్ అలానే ఉంటుంది. ప్రతి ఒక్కరూ లీనమవుతారు. ట్రైలర్ చూసిన చాలామంది ఎమోషన్ సీన్స్ లో బాగా నటించావని నాకు మెసేజ్ లు పెట్టారు.
* ఈ కథకి, టైటిల్ కి న్యాయం చేకూర్చినట్టేనా? మదర్ సెంటిమెంట్ అంటూ 'పాగల్' టైటిల్ ఏంటి?
౼ సినిమా ఒక ప్రేమ కథ అని చెప్పను. ప్రేమ గురించి చెప్పే ఒక గొప్ప కథ అని చెప్తా. అమ్మను పిచ్చిగా ప్రేమించే కొడుకు స్టోరీ. అమ్మ ప్రేమ తిరిగి దొరుకుతుందా లేదా? ఈ అంశాలతో ముడిపడిన ఈ సినిమాకి 'పాగల్' టైటిల్ సరిగ్గా సరిపోతుంది.
* ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి?
౼ ప్రస్తుతం పీవీపీ - దిల్ రాజు గారితో ఓ మూవీ చేస్తున్నా. అది కూడా 70 శాతం పూర్తయింది. అది లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా. బివిఎస్ఎన్ ప్రసాద్ గారితో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే సినిమా ఉంది.