మంచి పాటలను తొక్కేసుకుంటున్నారు!!

Update: 2017-10-22 01:30 GMT
ఈ మధ్య కాలంలో అసలు ఆల్బమ్ అంతా కూడా హిట్టవ్వడం అంటే చాలా కష్టమే. ఈ ఏడాదిలో అయితే ఖైదీ నెం 150 తరువాత ఆ రేంజులో పూర్తి స్థాయిలో ఒక సినిమాలోని పాటలన్నీ హిట్టవ్వడం మనం చూడనేలేదు. కాని విషయం ఏంటంటే.. హిట్టయ్యే పాటలు ఉన్నా కూడా .. వాటిని ప్రమోట్ చేయకపోవడం కారణంగా సదరు పాటలకు క్రేజ్ రావట్లేదు.

ఫర్ ఎగ్జాంపుల్.. రామ్ హీరోగా ఈ నెల 27న వస్తున్న 'ఉన్నది ఒకటే జిందగి' సినిమాను తీసుకోండి. ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ అందించిన ట్యూన్లకు మాంచి క్యాచీ మ్యాజిక్ ఉందనే చెప్పాలి. ముఖ్యంగా 'ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడు' 'వాట్ అమ్మా' పాటలు మామూలుగా లేవు. అయితే ఈ పాటలను ఏదో అప్పుడు యుట్యూబ్ లో రిలీజ్ చేయడం తప్పించి.. మనోళ్లు కాస్త ఖర్చుపెట్టి పబ్లిసిటీ చేయట్లేదు అంటున్నారు మ్యూజిక్ అభిమానులు. అందువలన హిట్టయ్యే లక్షణాలున్న పాటలు కూడా ఇప్పుడు అలా అలా వినిపించకుండా పోతున్నాయి. కేవలం సిటీల్లో ఉన్న రేడియో స్టేషన్లలో వచ్చినంత మాత్రాన.. ఊళ్ళలో ఉన్న జనాలకు ఎక్కవుగా.

పైగా ఇలా మంచి పాటలను ప్రమోట్ చేసుకోకపోతే.. సినిమాకు కూడా భారీ ఓపెనింగులు ఎక్కడి నుండి వస్తాయి? అస్సలు వచ్చే ఛాన్సేలేదు. మరి ఉన్నది ఒక్కటే జిందగీ ఈ సింపుల్ పాయింట్ ను ఎలా మర్చిపోయారబ్బా? అనవసరంగా మంచి పాటలను మంచి ఓపెనింగులనూ తొక్కేసుకుంటున్నారు కదూ.. ప్చ్!!
Tags:    

Similar News