వెంకటేష్ నటించిన నారప్ప సినిమా విడుదల అయిన తర్వాత సోషల్ మీడియాలో తెలుగు సినిమా అభిమానులు వర్సెస్ తమిళ సినిమా అభిమానులు అన్నట్లుగా వార్ జరుగుతోంది. అసురన్ బెస్ట్ అంటూ కొందరు.. అంతకు మించి నారప్ప ఉంది అంటూ మరి కొందరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
వెంకటేష్ నటపై తమిళ అభిమానులు కామెంట్స్ చేస్తే.. ధనుష్ పిల్ల పిచ్చుక.. మా వెంకీ మామ నటన ముందు అతడు జుజుబీ అంటూ తెలుగు అభిమానులు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలోనే ఇతర హీరోల అభిమానులు కూడా ఎంటర్ అయ్యి టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
ఈ వివాదం మరింతగా ముదురుతూ సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు కూడా మొదలు అయ్యాయి. కొందరు ఈ వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఆ స్టార్స్ ఫొటోలను వీళ్లు.. ఈ స్టార్స్ ఫొటోలను వారు బ్యాడ్ మీమ్స్ చేస్తూ అసభ్యంగా పోస్ట్ చేస్తున్నారు. ఈ సమయంలో హీరో సిద్దార్థ్ స్పందించాడు.
తెలుగు మరియు తమిళ సినీ అభిమానుల మద్య జరుగుతున్న ఫైట్ పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండు భాషల్లో కూడా సుపరిచితుడు అయిన సిద్దార్థ్ ఈ విషయమై స్పందిస్తూ.. టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ ట్విట్టర్ ఫైటింగ్ నేడు చూసిన తర్వాత నాకు ఓ ఆలోచన వచ్చింది.
నెట్ ఫ్లిక్స్ వారు ట్విట్టర్ లో నెట్ ఫ్లిక్స్ సౌత్ అనే ప్రత్యేక సౌత్ ఇండియా హ్యాండిల్ ను మొదలు పెట్టారు. హిందీకి ప్రత్యేకంగా ఒక ట్విట్టర్ హ్యాండిల్ ను ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ట్విట్టర్ లో సౌత్ ఇండియా అంటూ ఏర్పాటు చేయాలి. అందరు కలిసి సౌత్ లో ఉన్న నాలుగు భాషల కోసం నాలుగు ప్రత్యేక హ్యాండిల్స్ ను ఏర్పాటు చేయమని పోరాడవచ్చు కదా అంటూ సందేశం ఇచ్చాడు.
ప్రతి భాష కు దాని యొక్క ప్రత్యేకమైన స్థానం ఉండాలి. ఆ విషయమై నెట్ ఫ్లిక్స్ వారిని ఎందుకు ప్రశ్నించవద్దంటూ పిలుపునిచ్చాడు. ఆయన ట్వీట్ కు చాలా మంది స్పందించారు. అందులో కూడా ఒకరిని ఒకరు తిట్టుకుంటూనే ఉన్నారు తప్ప నిజమే నెట్ ఫ్లిక్స్ వారిని ఈ విషయమై ప్రశ్నించాలని మాత్రం అనుకోలేదు. అయితే ఈ వివాదంకు ముగింపు పలికేందుకు సిద్దార్థ్ రావడం అభినందనీయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి సిదార్థ్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సిద్దార్థ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు లో మహాసముద్రం సినిమాలో నటిస్తున్నాడు. చాలా కాలం తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమాలో సిద్దార్థ్ నటిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. మహాసముద్రం సినిమాలో హీరోగా శర్వానంద్ నటిస్తుండగా అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సిద్దార్థ్ మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయ్యేనా చూడాలి.