బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్'. 'భావ ప్రాప్తి' అన్న కాన్సెప్టుతో అడల్ట్ కంటెంట్ కి పరాకాష్టగా నిలిచిన ఈ వెబ్ సిరీస్ ద్వారా కియారా అద్వానీ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆమెపై చిత్రీకరించిన ఓ వీడియో వైరల్ గా మారి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ లో నాలుగు భాగాలుగా ప్రసారం అయిన ఈ వెబ్ సిరీస్ ని తెలుగులోనూ రీమేక్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించి నలుగురు దర్శకులకు అడ్వాన్స్ కూడా అందింది.
తొలి భాగాన్ని లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించడానికి సిద్ధమవుతోంది. మరో మూడు భాగాలకు తరుణ్ భాస్కర్.. సంకల్ప్ రెడ్డి.. సందీప్ వంగా దర్శకత్వం వహించబోతున్నారు. తొలి భాగంలో కియారా పాత్రని ఈషా రెబ్బా పోషిస్తోంది. బాలీవుడ్ కు మించి తెరపైకి రాబోతున్న ఈ లస్ట్ స్టోరీ కోసం నిర్మాణ సంస్థ ఏమేరకు బడ్జెట్ కేటాయిస్తోంది? అంటూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారంతా.
తాజా సమాచారం ప్రకారం.. ఒక్కో భాగానికి కోటి 50 లక్షలు చొప్పున నాలుగు భాగాలకు ఆరు కోట్ల బడ్జెట్‌ని కేటాయించారని తెలుస్తోంది. అయితే ఇంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులోనే దర్శకుడి పారితోషికంతో పాటు నటీనటులు.. సాంకేతిక నిపుణుల పారితోషికాలు సర్దుకోవాలట. తెలుగు లస్ట్ స్టోరీస్ సక్సెని బట్టి ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్మించాలని నెట్ ఫ్లిక్స్ వర్గాలు భావిస్తున్నాయి.