అలనాటి సీనియర్ హీరోయిన్, నటి రాధిక భర్త, నటుడు శరత్ కుమార్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఇటీవల ఆయన డయేరియా, డీ హైడ్రేషన్ కు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం శరత్ కుమార్ కు డాక్టర్లు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రాణాపాయం తప్పినట్టుగా డాక్టర్లు వెల్లడించినట్టుగా కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే శరత్ కుమార్ భార్య రాధిక, ఆయన కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ హాస్పిటల్ కు చేరినట్టుగా తెలుస్తోంది.
శరత్ కుమార్ తీవ్ర అస్వస్థకు గురయ్యారని, చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారనే వార్త వైరల్ గా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దీంతో చెన్నై అపోలో హాస్పిటల్ అభిమానులు భారీ స్థాయిలో చేరుకుని శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడం మొదలు పెట్టారు. అంతే కాకుండా తమ అభిమాన నటుడు శరత్ కుమార్ త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు చేయడం మొదలు పెట్టారు.
మరి కొంత మంది అభిమానులు మాత్రం శరత్ కుమార్ వీలైంత త్వరగా అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి తిరిగి రావాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారట. అభిమానులతో పాటు కోలీవుడ్ వర్గాల్లోనూ శరత్ కుమార్ అనారోగ్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా వుంటే గతంలో శరత్ కుమార్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గతంలో నటి రాధిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. వైత్యుల పర్యవేక్షణలో కరోనా నుంచి ఆయన కోలుకుంటున్నారని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా వైద్యులు సూచించిన మందులు వాడుతూ కరోనా నుంచి కోలుకున్న శరత్ కుమార్ ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి కావడంతో ఆయన అభిమానులు, కోలీవుడ్ వర్గాలు ప్రస్తుతం ఆందోళనకు గురవుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.