ఈసారి దసరా బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ చూడబోతున్నాం. టాలీవుడ్ లో అత్యంత ఆప్తులుగా మెలిగే మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ అక్కినేని నాగార్జున ఒకే రోజు రాబోతున్నారు. సీనియర్ హీరోలు నటించిన 'గాడ్ ఫాదర్' & 'ది ఘోస్ట్' సినిమాలు అక్టోబర్ 5వ తేదీన థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ హీరోగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ "ది ఘోస్ట్". ఇందులో సోనాలి చౌహాన్ హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ట్రైలర్ వరకూ.. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఆ సమయంలో 'గాడ్ ఫాదర్' కాస్త వెనుకబడి ఉంది.
మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ "గాడ్ ఫాదర్". ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ - నయనతార కీలక పాత్రలు పోషించారు. ఎంతమంది ఉన్నా దూకుడుగా ప్రమోషన్స్ చేయకపోవడంతో.. ఈ సినిమాకు మినిమమ్ బజ్ లేదని అభిమానులు ఆందోళన చెందారు. 'ఘోస్ట్' ముందు నిలవడం కష్టమే అని నెటిజన్లు కామెంట్స్ చేశారు.
అయితే చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలోని పొలిటికల్ డైలాగ్ ను ట్వీట్ చేయడంతో పరిస్థితి అంతా మారిపోయింది. గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేసి ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత.. సోషల్ మీడియాలో ఈ సినిమా టాపిక్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఎక్కడ చూసినా చిరంజీవి సినిమా గురించే మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో 'ఘోస్ట్' కాస్త వెనుకబడిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో 'ది ఘోస్ట్' ను తదుపరి స్థాయికి తీసుకెళ్లడం కోసం నాగార్జున ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు అని నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రమోషన్స్ విషయంలో నాగ్ అండ్ టీం ఒక అడుగు ముందుకేయాలని అక్కినేని అభిమానులు కోరుతున్నారు.
రానున్న రోజుల్లో 'ఘోస్ట్' సినిమాని వార్తల్లో నిలిపేలా కొన్ని ప్రత్యేక ప్రమోషన్ కార్యక్రమాలు ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కింగ్ ఇప్పటికే తన సినిమాకి తగినంత పబ్లిసిటీ చేయడానికి ప్రణాళికలు రచించాడని తెలుస్తోంది.
నాగార్జున - సోనాలి చౌహన్ లతో పాటుగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఏదో ఒక ఇంటర్వ్యూ రికార్డ్ చేసి అన్ని మీడియాకు రిలీజ్ చేయకుండా.. ప్రత్యేకంగా అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. స్పెషల్ గా ప్రోమోలు కట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అంతేకాకుండా ఈరోజు సాయంత్రం పవర్ ప్యాక్డ్ యాక్షన్ 'ది ఘోస్ట్' రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. ఇది ఇంతకుముందు వచ్చిన ట్రైలర్ కంటే మరింత ఇంటెన్సిటీ మరియు యాక్షన్ కలబోసి ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ కంటెంట్ సినిమాపై ఏ మేరకు హైప్ తీసుకొస్తుందో చూడాలి.
'ది ఘోస్ట్' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. నాన్ థియేట్రికల్ రూపంలో మేకర్స్ ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉన్నట్లు టాక్. అయితే ఈ సినిమా కోసం నాగార్జున ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సినిమాపై ఉన్న నమ్మకంతో రెమ్యునరేషన్ కు బదులుగా ఆంధ్రాలోని నాలుగు ప్రధాన ఏరియాల థియేట్రికల్ రైట్స్ ను తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈస్ట్ - వెస్ట్ - వైజాగ్ మరియు గుంటూరు ప్రాంతాల హక్కులను తీసుకున్న నాగ్.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. అలానే హిందీ రిలీజ్ విషయంలో నాగార్జున కీలకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. మరి నాగ్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్న 'ది ఘోస్ట్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.