బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ఫామిలీతో పాటు ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో కోవిడ్ అటాక్ అయినప్పుడు ఎదుర్కొన్న విషయాలని.. తీసుకోవాలని జాగ్రత్తలను అనిల్ షేర్ చేసుకున్నారు. ఐసోలేషన్ లో ఉన్నప్పుడు తన స్క్రిప్టులకి మెరుగులు దిద్దడమే కాకుండా.. బుక్స్ చదవటం అలవాటు చేసుకున్నామని దర్శకుడు తెలిపారు. తనకు కోవిడ్ సోకిందని తెలియగానే మహేష్ బాబు - వెంకటేష్ - వరుణ్ తేజ్ ఫోన్ చేసి పరామర్శించారని అనిల్ రావిపూడి చెప్పారు.
''మహేష్ బాబు గారు చాలా మంచి మనిషి. ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్ళకి ఆయన ఎలాంటి వారో తెలుస్తుంది. ఎలాంటి సిచ్యుయేషన్ నైనా ముందు దాని నుంచి బయటకు తీసుకురాడానికి ఆయన ప్రయత్నిస్తుంటారు. కరోనా వచ్చింది.. నేను బాధలో ఉన్నాననే ఆలోచనతో ఆయన మాట్లాడరు. ముందు ఎలా ఉందని పరామర్శ కోసం అడుగుతారు. మళ్ళీ దాని నుంచి వెంటనే బయటకు తీసుకురాడానికి తర్వాత కామెడీ చేస్తారు. మీరెక్కడికివెళ్లారు? మీరెందుకు తగిలించుకున్నారు? అంటూ కామెడీ చేశారు'' అని అనిల్ రావిపూడి తెలిపారు.
మహేష్ బాబు ఆ 10 డేస్ లో 3-4 రోజులకి ఒకసారి తనకు ఫోన్ చేసి సరదాగా మాట్లాడారని.. ఆ టైమ్ లో తనలో కాన్ఫిడెన్స్ పెంచిన వ్యక్తి మహేష్ అని.. తను కూడా దాన్నుంచి బయటకు రావడానికి వాట్సాప్ లో సరదాగా ఏమైనా షేర్ చేసేవాడినని అనిల్ చెప్పుకొచ్చాడు. అప్పటికే వరుణ్ తేజ్ కి కరోనా వచ్చి తగ్గిపోవడంతో తనకి కాల్ చేసి ఏమి కాదని ధైర్యం చెప్పేవాడని.. రెగ్యులర్ గా కాల్ చేసి టేస్ట్ పోయిందా, వాసన పోయిందా అని అడిగే వాడని వెల్లడించారు. వెంకటేష్ ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పేవారు అని రావిపూడి అనిల్ చెప్పారు.