సంక‌ల్పానికి టాలీవుడ్ ప్రోత్సాహ‌మెక్కడ‌?

Update: 2022-06-11 00:30 GMT
తెలుగు సినిమా నేడు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. గ్లోబ‌ల్ మూవీగానూ వెలుగెత్తి చాటేంత స‌త్తా టాలీవుడ్ కి ఉంది. ఇన్నోవేటివ్ థాట్స్ ని సైతం ప్రోత్స‌హించ‌డానికి  నిర్మాత‌లు ముందుకొస్తున్నారు. సురేష్ బాబు..దిల్ రాజు.. అల్లు అర‌వింద్ స హా న‌వ‌త‌రం నిర్మాత‌లు  తెలుగు సినిమాని న‌వ్య పంథాలో ఆవిష్క‌రించాల‌ని ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకెళ్తున్నారు.

టెక్నాల‌జీ ప‌రంగా ఎంత ప‌రిజ్ఞానం సంపాదిస్తే అంత‌గా ఉన్న‌త శిఖ‌రాల్ని అధిరోహించొచ్చు! అన్న ఆలోచ‌న ధోర‌ణి క‌నిపిస్తుంది. అందుకే బాలీవుడ్ లో సైతం  సినిమాలు నిర్మించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ మేక‌ర్స్ బాలీవుడ్ కి వెళ్ల‌డం...తెలుగు న‌టులు హిందీ న‌టుల‌తో కలిసి ప‌నిచేయ‌డం ఇదంతా ప‌రిశ్ర‌మ వృద్దికి ఎంతో క‌లిసొస్తుంద‌న్న‌ది వాస్త‌వం.

ఇంత‌గా ఎదుగుతోన్న టాలీవుడ్ ని ఎవో కొన్ని శ‌క్తులు వెన‌క్కి  లాగుతున్న‌ట్లే!  క‌నిపిస్తుంద‌న్న‌ది కొంత మంది క్రియేటివ్ మేక‌ర్స్ వెనుక‌బాటు త‌నాన్ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. అలా కాక‌పోతే టాలీవుడ్ ని వ‌దిలి ఆ యంగ్ మేక‌ర్ బాలీవుడ్ కి ఎందుకు వెళ్తాడు? అన్న మీమాంస అభిమానుల్లో రేకెత్తింది. ఇంత‌కీ ఎవ‌రా  యంగ్ మేక‌ర్? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

తొలి సినిమా 'ఘాజీ'తోనే విమ‌ర్శకుల‌ ప్ర‌శంలంద‌కున్నాడు సంక‌ల్ప్ రెడ్డి.  వెరీ ట్యాలెంటెడ్ మేక‌ర్ అని మొద‌టి ప్ర‌య‌త్నంతోనే  నిరూపించుకున్నాడున్నాడు. టెక్నిక‌ల్ నేప‌థ్యంతో కూడిన సినిమాల‌పై త‌న‌కున్న ప‌రిజ్ఞానాన్ని మొద‌టి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే తొలి సినిమాతోనే జాతీయ అవార్డు సొంతం సైతం చేసుకున్నారు.

ఓ యంగ్ మేక‌ర్ తొలి సినిమాతోనే జాతీయ అవార్డు ద‌క్కించుకోవ‌డం అన్న‌ది తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే ఓ  అరుదైన ఘ‌ట్టం. అటుపై 'అంత‌రిక్షం' అనే మ‌రో సినిమా చేసి వైఫ‌ల్యం చెందాడు. కానీ విమ‌ర్శ‌కులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. ఈ ప్ర‌య‌త్నం ప్ర‌శంసించ‌ ద‌గ్గ‌దే. వాణిజ్యం అంశాల్ని దృష్టిలో పెట్టుకుని చేసుకున్న సినిమా కాద‌ని ముందే తెలుసు.

కొంత మంది ప్రోత్సాహంతోనే  అత‌ను సినిమా చేయ‌గ‌లిగారు. కానీ బాక్సాఫీస్ ఫ‌లితం నిరాశ ప‌ర‌చ‌డంతో సంక‌ల్ప్ కి మ‌రో తెలుగు సినిమా అవ‌కాశ‌మే గ‌గ‌న‌మైపోయింద‌న్న‌ది వాస్త‌వం.  కానీ టాలీవుడ్ అత‌ని ప్ర‌తిభ‌ని గుర్తించ‌లేక‌పోయినా...బాలీవుడ్ మాత్రం గుర్తించింది. అందుకే 'ఐబీ71' అనే సినిమా ఛాన్స్ వ‌చ్చింది. ఈ ఛాన్స్ తో ఒక ఫెయిల్యూర్ త‌ర్వాత టాలీవుడ్ యంగ్ ట్యాలెంట్ ని ఎలా ప‌క్క‌న బెట్టేస్తుంద‌న్న‌ది  క్లారిటీ వ‌చ్చింది.

జాతీయ  అవార్డు అందుకున్న మేక‌ర్ కి..ఒక స‌క్సెస్ ఇచ్చిన ప్ర‌తిభ‌కి ఇప్పుడు  ప్రోత్సాహ‌మే క‌రువైంది. 'ఘాజీ' స‌క్సెస్ చూసిన సీనియ‌ర్ నిర్మాత‌లు..ద‌ర్శ‌కులు యంగ్ మేక‌ర్ ని ఆనాడు ఆకాశం..అంద‌లానికి  ఎక్కించేసారు. కానీ ఒక ప‌రాజ‌యంతో మ‌ళ్లీ అంథ కూపంలోకి తోసేసారు అన్న‌ది అంతే వాస్త‌వం. క‌మ‌ర్శియ‌ల్ సినిమా చేసి ఫెయిలైన  ద‌ర్శ‌కుల‌కు ఇక్క‌డ అవ‌కాశాలుంటాయి?  కానీ క్రియేటివ్ గా...అపార సాంకేతిక ప‌రిజ్ఞానం ఉన్న మేక‌ర్ల‌కి మాత్రం  ఛాన్స్ అన్న‌ది అంత వీజీ కాద‌ని టాలీవుడ్ మ‌రోసారి నిరూపించింది.

చివ‌రికి సంక‌ల్ప్ ఎంత‌గా వెనుక‌బ‌డిపోయాడంటే?  'పిట్ట క‌థ‌లు' అనే సినిమాకి తాను న‌లుగురు ద‌ర్శ‌కుల్లో  ఓ ద‌ర్శ‌కుడిగా పేరు వేయించుకోవాల్సినంత‌గా సీన్ అత‌న్ని డిమాండ్ చేసిందంటే న‌మ్ముతారా?  కానీ ఇది న‌మ్మాల్సిన నిజం. అత‌ని ఐడియాల‌జీ వేరు. ఎంతో సాంకేతిక ప‌రిజ్ఞానం సంపాదించుకుని ఎంట్రీ ఇచ్చాడు.

ప్రోత్స‌హిస్తే  హాలీవుడ్ స్థాయిలోనే టాలీవుడ్ లో  సినిమాలు చేయాల‌ని క‌ల‌లు కన్నారు. సంక‌ల్ప్ బుర్ర నిండా టెక్నిక‌ల్ నేప‌థ్యంతో కూడుకున్న క‌థ‌లే ఉన్నాయ‌ని ఓ సంద‌ర్భంలో సైతం రివీల్ చేసారు. కానీ అత‌ని ప్ర‌తిభ‌కి త‌గ్గ ప్రోత్సాహ‌మెక్క‌డ‌? ఇలాంటి ప్ర‌తిభావంతులు..ఔత్సాహికులు కృష్ణాన‌గ‌ర్..చిత్ర‌పూరి కాల‌నీలో చాలా మందే ఉన్నారు. అయినా అస‌లుకు లేని అస‌ర  కొస‌రకు ఎలా ఉంటుంది.
Tags:    

Similar News