బ‌న్ని కెరీర్ లో ప్ర‌భావ‌వంత‌మైన సినిమా ఏది?

Update: 2021-04-23 07:30 GMT
బ‌న్ని కెరీర్ లో ప్ర‌భావ‌వంత‌మైన సినిమా ఏది?
  • whatsapp icon
బ‌న్ని కెరీర్ లో అత్యుత్త‌మ ప్ర‌భావ‌వంత‌మైన‌ సినిమా ఏది? అంటే ఈ ప్ర‌శ్న‌కు ఏమాత్రం త‌డుముకోకుండా అల వైకుంఠ‌పుర‌ములో అని చెబుతున్నారు అభిమానులు. కానీ ఇది నిజ‌మా? అంటే బ‌న్ని కెరీర్ లో ఆర్య- దేశ‌ముదురు లాంటి సినిమాలు ఉన్నాయి. అవ‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన‌వే. ప్ర‌భావితం చేసిన‌వే.

అయితే అత‌డికి మాస్ లో వీరాభిమానుల్ని తెచ్చి పెట్టిన సినిమా గా స‌రైనోడు రికార్డుల‌కెక్కింది. ఇది ఓ రొటీన్ మాస్ మ‌సాలా యాక్ష‌న్ సినిమా అని తీసి పారేసినా కానీ.. ఈ సినిమాతోనే ఇటు ద‌క్షిణాది.. అటు ఉత్త‌రాది(హిందీ అనువాదం రిలీజైంది)నా మాస్ లో ప్ర‌త్యేక అభిమానం సంపాదించాడు బ‌న్ని. అంత‌టి మాస్సీగా బ‌న్నిని చూపించడంలో బోయ‌పాటి స‌క్సెస‌య్యారు.

ఏ-క్లాస్ కి మాస్ సినిమాలు న‌చ్చాల‌నేమీ లేదు. ఆ కోణంలో చూస్తే స‌రైనోడు క్లాస్ ఆడియెన్ కోసం కాదు. కానీ బ‌న్ని లెక్క‌లు బ‌న్నీకి ఉన్నాయి. అందుకే బోయ‌పాటితో మాస్ సినిమా చేశారు. అయితే బ‌న్ని కెరీర్ ప్ర‌భావ‌వంత‌మైన సినిమాగా స‌రైనోడుకి ఎక్కువ మంది క్రెడిట్ ఇవ్వడంలో విఫలమయ్యారు. ఇది బన్నీ కెరీర్ లో ఒక మైలురాయి చిత్రం అని అంగీక‌రించ‌లేదు.

అయితే బ‌న్ని స్థాయిని మార్కెట్ ను పెంచిన సినిమా ఇది. సరైనోడు చిత్రాన్ని హిందీలోకి అనువ‌దించి యూట్యూబ్ లో రిలీజ్ చేయ‌గా అది రికార్డులు సృష్టించింది. అల్లు అర్జున్ తన కెరీర్ లో స‌రైనోడు ఒక మైలురాయి చిత్రం అని అంగీకరించడ‌మే కాదు.. ఈ ప్రాజెక్టులో భాగ‌మైన వారికి కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు బోయపతి శ్రీనుకు తగిన క్రెడిట్ ఇచ్చాడు. రకుల్ ప్రీత్ సింగ్- కేథరీన్ థ్రెసా- తమన్- ఆది లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 22 ఏప్రిల్ 2016 స‌రైనోడు రిలీజైన తేదీ. రిలీజై ఐదేళ్లయినా ఈ సినిమాకి టీవీల్లో మాస్ ఆడియెన్ ఆద‌ర‌ణ ద‌క్కుతోంది.

ఇక బ‌న్ని కెరీర్ లో క్లాస్ సినిమాలుగా స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి- అల వైకుంఠ‌పుర‌ములో సంచ‌లనాలు సృష్టించాయి. త్రివిక్ర‌మ్ ఫ్యామిలీ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమాలు ఇవి. బోయ‌పాటి.. సురేంద‌ర్ రెడ్డి (రేసుగుర్రం) లాంటి మాస్ డైరెక్ట‌ర్ల‌ తో త్రివిక్ర‌మ్ లాంటి క్లాస్ డైరెక్ట‌ర్ తో బ‌న్నీకి వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ప్రూవైంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్పతో బిజీగా ఉన్నారు. బ‌న్ని పుట్టినరోజు సందర్భంగా పుష్ప టీజర్ విడుద‌లై రికార్డులు బ్రేక్ చేసింది.  పుష్ప ఆగస్టు 13 న విడుదల కానుంది. ప్ర‌స్తుత క్రైసిస్ వ‌ల్ల షూటింగ్ వాయిదా ప‌డింది. దీనివ‌ల్ల రిలీజ్ ల‌పై అనిశ్చితి నెల‌కొంది.
Tags:    

Similar News