తన బెడ్‌ మీద ఎవరున్నా చిరాకే అంటోంది

Update: 2020-04-01 06:30 GMT
బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ.. మోస్ట్‌ కాంట్రవర్శీ హీరోయిన్‌ కంగనా రనౌత్‌. ఈ అమ్మడికి తలపొగరు కాస్త ఎక్కువ అని కొందరు అంటూ ఉంటే మరికొందరు మాత్రం ఆమె స్వాతంత్య్ర భావాలు కలిగిన ఈతరం అమ్మాయి అంటూ మరికొందరు అంటూ ఉంటారు. తనకు తాను మాత్రం ఒక స్టార్‌ అని అని.. స్వాతంత్య్ర భావాలు అధికంగా ఉన్న వ్యక్తినని కంగనా అభిప్రాపడుతూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మరోసారి తన స్వాతంత్య్ర భావాల గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేసింది.

నేను ఎప్పుడు కూడా నా బెడ్‌ ను ఎవరితోనూ షేర్‌ చేసుకోను. ఎప్పుడు కూడా ఒంటరిగానే పడుకునేందుకు ప్రియార్టీ ఇస్తాను. ఇతరులతో బెడ్‌ షేరింగ్‌ అంటేనే నాకు చిరాకు. దీన్ని బట్టే మీరు నా స్వాతంత్య్ర భావాలను అర్థం చేసుకోవచ్చు అంటోంది. ఏదైనా సమయంలో డేటింగ్‌ లేదా సరదా డిన్నర్‌ కు వెళ్లినా కూడా ఎవరితో అయినా బెడ్‌ షేర్‌ చేసుకోవాల్సి వచ్చినా మద్యరాత్రి తర్వాత అయినా కూడా నా బెడ్‌ కు నేను వెళ్లడం కాని విడిగా మరో బెడ్‌ లోకి వెళ్లడం కాని చేస్తానంటోంది.

నా స్వాతంత్య్ర భావాలే నన్ను ఈ స్థాయికి తీసుకు వచ్చాయి. నాకు నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తాను. ఒక పాత్ర గురించి లేదంటే ఒక సినిమా గురించి నన్ను ఎవరు కూడా ఒత్తిడి చేయలేరు. ఎంత పెద్ద స్టార్‌ అయినా కూడా నేను చేయాలనుకుంటేనే చేస్తాను. గతంలో సల్మాన్‌ ఖాన్‌ సుల్తాన్‌ సినిమాతో పాటు సంజు సినిమాలో రణ్‌ బీర్‌ కపూర్‌ కు జోడీగా ఛాన్స్‌ మొదట నాకే వచ్చింది. కాని నాకు ఆ సినిమాల్లో చేయాలనిపించలేదు.

ప్రముఖులతో విభేదాలు.. పెద్ద సినిమాలకు నో చెప్పడాలు చేసినా కూడా కంగనా కెరీర్‌ మాత్రం ఇంకా కూడా మంచి స్థాయిలోనే ఉంది. ఆమె మొండితనం ఇంకా నిర్మొహమాటంగా మాట్లాడే గుణం కారణంగా ఆమెకు కొందరు భయపడతారు. కొందరు ఆమెను గౌరవిస్తారు. కనుక ఆమె ఇంకా కూడా స్టార్‌ హీరోయిన్‌ గా కొనసాగుతుందని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని ఆమె ప్రవర్తన వల్ల బాలీవుడ్‌ లో ఎక్కువ శాతం మందితో విరోదంనే పెట్టుకుంది.
Tags:    

Similar News