సీనియర్ హీరోలకు నాయికల్ని వెతకడం కష్టంగానే ఉంటోంది. అయినా బోయపాటి లాంటి వాళ్లు బాలయ్యతో ఎంత కంఫర్ట్ గా మూవ్ అవుతారో చూస్తున్నదే. అలాగే సీనియర్లు ఇంకా కథానాయికలతో డ్యూయెట్లు పాడుకునే కథలు వదిలేసి తాము మాత్రమే చేయదగ్గ పాత్రల్ని కథాంశాల్ని ఎంచుకునే సమయం ఆసన్నమైంది. వయసు పడుతుండటంతో అన్ని రకాల పాత్రలు చేయాలంటే వెటరన్స్ కు ఇబ్బందికరమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఓ సూచన చేశారట. బాలకృష్ణ-బోయపాటి హ్యాట్రిక్ ప్రయత్నంలో తాజా అప్ డేట్ హీట్ పెంచేస్తోంది.
బిబి3 గా రాబోతున్న ఈ మూవీలో బాలయ్య రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లలో కనిపించబోతున్నారు. మరో కీలక పాత్రని ఓ యంగ్ హీరోతో చేయించబోతున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. ఆ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్- నాగశౌర్య- నారా రోహిత్ వంటి వాళ్ల పేర్లు కూడా వినిపించాయి. అయితే బాలయ్య తో డెడ్లీ కాంబినేషన్ వుండాలంటే పవర్ ఫుల్ స్టార్ అయితేనే బావుంటుందనిని బోయపాటి కాంప్రమైజ్ కావడం లేదట.
బాలయ్యకు సమఉజ్జీగా ఉండే పవర్ ఫుల్ రోల్ కావడంతో ఆ పాత్రకు తగ్గ నటుడు అయితేనే స్క్రీన్ పై ఆ కాంబినేషన్ డెడ్లీగా వుంటుందని.. ఆడియన్స్ కి కూడా రోమాంచితంగా కనిపిస్తుందని బోయపాటి శ్రీను భావిస్తున్నారట. ఈ విషయంలో ఎవరి మాట వినడం లేదని.. కాంప్రమైజ్ అస్సలు కావడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే బోయపాటి కోరుకున్న నటుడు లభిస్తాడా లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.