`ఫైట‌ర్` విల‌న్ ఎవ‌రో తెలుసా?

Update: 2019-12-20 09:27 GMT
'డియ‌ర్ కామ్రేడ్` ఫెయిలైనా దేవ‌ర‌కొండ క్రేజు ఇసుమంత కూడా త‌గ్గ‌లేదు. అర్జున్ రెడ్డి- గీత గోవిందం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు అత‌డికి బిగ్ మైలేజ్ ని ఇచ్చాయ‌నే చెప్పాలి. ఇక వీట‌న్నిటినీ మించి రౌడీ యాటిట్యూడ్ తో అత‌డు త‌న‌ని తాను ప్ర‌మోట్ చేసుకుంటున్న విధానం చ‌ర్చ‌కొస్తోంది. ఇటు టాలీవుడ్ స‌హా బాలీవుడ్ .. కోలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారాడు. ఆ క్ర‌మంలోనే అత‌డు న‌టిస్తున్న త‌దుప‌రి చిత్రాల‌పై అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ప్ర‌స్తుతం విజ‌య్ న‌టిస్తున్న `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల రోజు కానుక‌గా రిలీజ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా ప్ర‌చారం వేడెక్కిస్తోంది. ఈలోగానే డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్వ‌క‌త్వంలో `ఫైట‌ర్`లో న‌టిస్తున్నాడు అన్న ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఇస్మార్ట్ డైరెక్ట‌ర్ తో సినిమాని ప్ర‌క‌టించ‌గానే రౌడీ ఫ్యాన్స్ లో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. ఈ చిత్రంలో విజ‌య్ మునుపెన్న‌డూ చూడ‌ని యాక్ష‌న్ హీరోగా క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో క‌థానాయిక ఎవ‌రు?  విల‌న్ ఎవ‌రు? అన్నదానిపైనా స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. రౌడీ స‌ర‌స‌న న‌టించే నాయిక‌లుగా జాన్వీ క‌పూర్ లేదా కియ‌రా అద్వాణీ అంటూ పేర్లు వినిపించాయి కానీ ఎవ‌రినీ క‌న్ఫామ్ చేస్తూ పూరి-చార్మి బృందం ప్ర‌క‌టించ‌లేదు.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ అతిధి పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చా సాగుతోంది. అంతేకాదు కార్తికేయ విల‌న్ గా న‌టించే అవ‌కాశం లేక‌పోలేద‌న్న మాటా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. కార్తికేయ ఇటీవ‌లే నానీస్ గ్యాంగ్ లీడ‌ర్ లో విల‌న్ గా న‌టించిన క్ర‌మంలో అత‌డిని అదే త‌ర‌హా పాత్ర‌కు పూరి ప‌రిగ‌ణిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే పూరి- ఛార్మి బృందంతో క‌ర‌ణ్ జోహార్ జాయిన్ అయ్యారు. ప్రీప్రొడ‌క్ష‌న్ పూర్త‌వుతోంది. ఇందులో కాస్టింగ్ ఎవ‌రు?  టెక్నీషియ‌న్స్ ఎవ‌రు?  త‌దిత‌ర వివ‌రాల్ని వెల్ల‌డి కావాల్సి ఉంది. పూరి-క‌ర‌ణ్ జోడీ పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్న క్ర‌మంలో దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక మ‌జిలీ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌- దిల్ రాజు కాంబినేష‌న్ లో దేవ‌ర‌కొండ న‌టించే 12వ సినిమాని ఇటీవ‌ల దిల్ రాజు బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా 2020 ద్వితీయార్థంలో సెట్స్ కెళ్ల‌నుంది.
Tags:    

Similar News