ప్ర‌భాస్ ని డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారు?

Update: 2021-10-20 04:07 GMT
`ఈశ్వ‌ర్` సినిమాతో టాలీవుడ్ లో ప్ర‌వేశించాడు ప్ర‌భాస్ రాజు. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు న‌ట‌వార‌సుడిగా .. నిర్మాత సూర్య‌నారాయ‌ణ‌రాజు త‌న‌యుడిగా అత‌డి ఎంట్రీ స‌జావుగానే సాగింది. కానీ ఆరంభం ఆశించిన విజయాలు ద‌క్క‌లేదు. అయితే ప్ర‌భాస్ క‌టౌట్ మాస్ అప్పీల్ కి ప్ర‌త్యేకించి అభిమానులేర్ప‌డ్డారు. ఇక కాల‌క్ర‌మంలో టాలీవుడ్ అగ్ర నిర్మాత‌లు ద‌ర్శ‌కులు అత‌డితో సినిమాలు చేయ‌డం అవి బంప‌ర్ హిట్లు కొట్ట‌డంతో ప్ర‌భాస్ రేంజు అమాంతం మారిపోయింది.

వ‌ర్షం- ఛ‌త్ర‌ప‌తి అత‌డి రేంజునే మార్చేశాయి. బాహుబ‌లి ఫ్రాంఛైజీతో అత‌డు దేశంలోనే అతి పెద్ద పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్ర‌భాస్ ఇప్ప‌టికిప్పుడు వ‌రుసగా నాలుగైదు పాన్ ఇండియా చిత్రాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌భాస్ ని ఇండ‌స్ట్రీ లో అంద‌రూ డార్లింగ్ అని అభిమానంగా పిలుచుకుంటారు. ప్ర‌భాస్ కూడా త‌న స‌హ‌చ‌రుల‌ను డార్లింగ్ అనే పిలుపుతో స్వీట్ హార్ట్ గా మారాడు. డార్లింగ్ టైటిల్ తో దిల్ రాజు ఓ సినిమానే నిర్మించారు.

ప్రభాస్ చాలా చిన్న పిల్లవాడి మ‌న‌స్త‌త్వంతో అందరినీ డార్లింగ్ అని పిలుస్తాడు. కానీ ఆ ప‌దం ఎలా పుట్టింది? అంటే .. ప్రభాస్ కూడా ఆ పదం తనకు ఎలా అతుక్కుపోయిందో తెలియదని అంటాడు. కానీ ఇప్పుడు అందరూ అతన్ని డార్లింగ్ అని పిలుస్తున్నారు. ఓమారు డార్లింగ్ అనే ప‌దం పుట్టుక గురించి ప్ర‌భాస్ ని ప్ర‌శ్నిస్తే.. ఆయ‌న గ‌తంలోకి వెళ్లారు.

`బుజ్జిగాడు` సినిమా సమయంలోనే పూరిని తాను చాలా ప్రేమిస్తున్నానని.. అతన్ని డార్లింగ్ అని పిలిచేవాడిన‌ని ప్రభాస్ చెప్పాడు. అదే సమయంలో పూరి ప్రభాస్ నుండి దాన్ని ఎంచుకుని తన సినిమాలో ఉపయోగించాడు. బుజ్జిగాడు చిత్రంలో డార్లింగ్ అంటూ ప్రభాస్ చేసే విన్యాసాలు మాస్ కి ఓ రేంజులోనే క‌నెక్ట‌య్యాయి. ఇక అప్ప‌టి నుంచి ప్ర‌భాస్ ని ప్ర‌తి ఒక్క‌రూ డార్లింగ్ అనే పిలిచేవారు. ఇప్పుడు ప్రతి సినిమాలో డార్లింగ్ అనే పిలుపును కనీసం ఒక్కసారైనా ప్ర‌భాస్ ఉపయోగిస్తాడు. త‌న స‌హ‌చ‌రులతో ఎప్పుడు హుందాగా ఉంటూ డార్లింగ్ అని పిలిచేస్తూ అంద‌రివాడ‌య్యాడు ప్ర‌భాస్. ఇప్ప‌టికైనా అర్థ‌మైందా...? డార్లింగ్ అనే పిలుపు ఎలా స్థిర‌ప‌డిందో?

పాన్ ఇండియా చిత్రాల‌తో జోరు..

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ షెడ్యూల్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `బాహుబ‌లి` త‌ర్వాత ప్ర‌భాస్ క్ష‌ణం తీరిక లేనంత బిజీ అయిపోయారు. ప్ర‌స్తుతం వ‌రుస‌గా నాలుగు పెద్ద ప్రాజెక్ట్ లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్`..ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్`....బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓరౌంత్ తో క‌లిసి `ఆదిపురుష్` లో న‌టిస్తున్నారు. ఇవి గాక నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్ కె` లోనూ న‌టిస్తున్నాడు. ఇంకా లైన్ లో పెట్టిన సినిమాల జాబితా పెద్ద‌దే ఉంది.

మ‌రోవైపు బిజినెస్ లోనూ పెట్టుబ‌డి..

ప్ర‌భాస్ ఇప్ప‌టికే స్నేహితుల‌తో క‌లిసి మ‌ల్టీప్టెక్స్ బిజినెస్ లో ఉన్నారు. ఇక‌పైనా 500 కోట్ల పెట్టుబ‌డి వ్యాపారం రంగంలో పెట్టాల‌ని ప్ర‌భాస్ ప్లాన్ చేస్తున్నాడుట‌. దీనిలో భాగంగా ప్ర‌భాస్ స్నేహితులు..స‌న్నిహితులు వివిధ వ్యాపారాల గురించి డార్లింగ్ వ‌ద్ద డిస్క‌స్ చేసిన‌ట్లు స‌మాచారం. కొంత మంది రియ‌ల్ ఏస్టేట్ లో పెట్ట‌మ‌ని కోర‌గా..మ‌రికొంత మంది హోట‌ల్ రంగంలో బావుంటుంద‌ని స‌జ్జెస్ట్ చేసిన‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇంకొంత మంది మంది ఇండియా లో హాట‌లో రంగం క‌న్నా విదేశాల్లో హోట‌ల్ రంగంలో పెట్టుబ‌డులు పెడితే ఆదాయం బాగుంటుంద‌ని స‌ల‌హాలు ఇచ్చారుట‌. అయితే ప్ర‌భాస్ నిర్ణ‌యం ఇంకా తీసుకోలేద‌ని..కేవ‌లం స‌ల‌హాలు మాత్రమే తీసుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ప్ర‌భాస్ స్నేహితులైన యూవీ క్రియేష‌న్స్ అధినేత‌లు వంశీ-ప్ర‌మోద్ ల‌తో క‌లిసి డిస్ర్టిబ్యూష‌న్ రంగంలో ప్ర‌భాస్ ఉన్నారు. ఆ బ్యాన‌ర్లో సినిమాలు చేస్తే ఎలాంటి పారితోషికం తీసుకోకుండా వ‌చ్చిన లాభాల్లో వాటాలు తీసుకుంటారు. అలాగే పంపిణీలో వాటా కూడా అందుకుంటారు. ఈ నేప‌థ్యంలో వంశీ-ప్ర‌మోద్ ల స‌ల‌హాలే ఇక్క‌డ కీల‌కంగా ప‌ని చేస్తాయ‌ని చెబుతారు.




Tags:    

Similar News