కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్ మూవీ భారతీయుడు 2కి అనూహ్యంగా బ్రేకులు పడడం అభిమానుల్ని కలతకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రేజీ సినిమాకి ఆరంభం నుంచి రకరకాల అవాంతరాలు ఏర్పడడం.. దర్శకుడు శంకర్ తో లైకా నిర్మాణ సంస్థకు వివాదాలు తలెత్తడం.. అవి చినికి చినికి గాలి వానై చివరికి కోర్టు మెట్లు ఎక్కేవరకూ వెళ్లడం.. ఆపై సినిమా ఎటూ కాకుండా ఆగిపోవడం.. ఇదంతా చూస్తుంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.
అయితే భారతీయుడు 2 ఆగిపోవడానికి శంకర్ ఒక్కడే కారణమా? కమల్ హాసన్ కి ఎలాంటి సంబంధం లేదా? కమల్ ని అనలేకే శంకర్ పై లైకా విరుచుకుపడుతోందా? అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోవడానికి కారణం లైకా పై గుర్రుగా ఉన్న కమల్ హాసనే అంటూ ఒక సెక్షన్ ప్రచారం ప్రారంభించింది.
ఎన్నికలు రాజకీయాలు అంటూ బిజీ అయిపోయిన కమల్ మధ్యలో బిగ్ బాస్ రియాలిటీ షో హోస్టింగుతో .. విక్రమ్ మూవీ చిత్రీకరణతో బిజీ అయిపోయారు. కానీ లైకాకు శంకర్ కు మధ్య వివాదం సద్ధుమణిగేందుకు ఏదీ చేయలేదని కూడా విమర్శిస్తున్నారు. మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ అనకుండా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చి కమల్ పెద్దరికం నెరిపితే భారతీయుడు 2 సజావుగా పూర్తయ్యేదన్న విమర్శ ఒక సెక్షన్ నుంచి బలంగా వినిపిస్తోంది. మరి దీనికి కమల్ సమాధానమేమిటి? అన్నది వేచి చూడాలి.
నేను సేనాపతిని దేనికీ స్పందించను! అంటే చేసేదేం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. కమల్ హాసన్ ని ఏమీ అనలేకే లైకా సంస్థ శంకర్ ని కోర్టుకీడ్చిందన్న దానిపైనా పూర్తి క్లారిటీ అట్నుంచే రావాల్సి ఉంది.