లైకా ఎందుకు ఇంతటి మొండితనం?

Update: 2021-05-15 03:32 GMT
కోలీవుడ్ సూపర్‌ హిట్‌ మూవీ భారతీయుడు కు శంకర్‌ సీక్వెల్‌ గా ఇండియన్ 2 ను లైకా ప్రొడక్షన్స్‌ లో ప్రారంభించాడు. వరుసగా ఏదో ఒక కారణాల వల్ల సినిమా షూటింగ్‌ కు బ్రేక్‌ లు పడుతూ వచ్చాయి. సెట్‌ లో క్రేన్‌ ప్రమాదం కారణంగా సినిమా షూటింగ్‌ ఆగిపోయి మళ్లీ ప్రారంభం అవుతుందని భావిస్తున్న సమయంలో కరోనా వచ్చి గత ఏడాది నుండి అటకెక్కింది. సినిమా షూటింగ్‌ ను పునః ప్రారంభించాలని శంకర్ ప్రయత్నించిన సమయంలో లైకా వారు నో చెప్పగా.. ఇప్పుడు లైకా వారు సినిమాను పూర్తి చేయాలని చూస్తుంటే శంకర్ ఆసక్తి చూపడం లేదు. దాంతో శంకర్‌ మరియు లైకా వారి మద్య వివాదం ముదురుతోంది.

లైకా ప్రొడక్షన్స్‌ వారు ఇప్పటికే ఈ విషయాన్ని కోర్టు వరకు తీసుకు వెళ్లారు. తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన వారు మరియు కోర్టు కూడా రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాని వివాదంకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెండు వైపుల నుండి ఎలాంటి పట్టు విడుపులు కనిపించడం లేదు. లైకా ప్రొడక్షన్స్ వారు జూన్‌ వరకు ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయాల్సిందే అంటూ శంకర్‌ ను డిమాండ్‌ చేస్తూ ఉన్నారు. మరో నెల రోజుల్లో సినిమా ఎలా పూర్తి అవుతుంది అనే విషయాన్ని లైకా వారు పట్టించుకోకుండా మొండితనంతో సినిమా ను జూన్‌ వరకు పూర్తి చేసి తమకు అప్పగించాల్సిందే అంటున్నారు.

ఇండియన్ 2 ను పూర్తి చేయకుండా రామ్ చరణ్‌ తో ఒక సినిమాను మరియు బాలీవుడ్‌ లో అపరిచితుడు సినిమా ను రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు. దాంతో లైకా ప్రొడక్షన్స్‌ వారు తెలుగు సినిమా నిర్మాతల మండలికి మరియు బాలీవుడ్ నిర్మాతల మండలికి లేఖ లు రాశారు. ఆ లేఖలో శంకర్ తమ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసే వరకు మరో సినిమా ను కమిట్‌ అవ్వనంటూ అగ్రిమెంట్‌ లో ఉన్నారు. కనుక ఎవరు కూడా ఆయనతో సినిమా లను నిర్మించేందుకు సిద్దం అవ్వద్దు అనేది ఆ లేఖ సారాంశం. శంకర్‌ తో రాజీ పడేందుకు ప్రయత్నించకుండా లైకా వారు ఆయనతో ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడుతున్నారు. దాంతో లైకా వారి తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారం మరెంత దూరం వెళ్తుందో చూడాలి.
Tags:    

Similar News