డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చదువు అనంతరం సినిమాలపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన అనిల్ రావిపూడి.. 2008లో విడుదలైన 'శౌర్యం' మూవీతో రచయితగా మారాడు. ఆ తర్వాత అరడజన్ పైగా చిత్రాలకు రచయితగా పని చేసిన ఆయన.. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'పటాస్' మూవీతో డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాదు.. అనిల్ రావిపూడి టేకింగ్ కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. దాంతో అనతి కాలంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా స్థానం సంపాదించుకున్న అనిల్ రావిపూడి.. ఇటీవల 'ఎఫ్ 3'తో ప్రేక్షకులను పలకరించాడు. మే 27న విడుదలైన ఈ ఔట్ అంట్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సైతం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద నయా కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి హీరోల ఎంపికలో మిగిలిన డైరెక్టర్స్ కంటే చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఒక్క హిట్ పడిందంటే చాలు డైరెక్టర్లు స్టార్ హీరోల కోసం పోటీ పడుతుంటారు. కానీ, వరుస హిట్లు పడుతున్నా అనిల్ రావిపూడి మాత్రం సీనియల్ హీరోలపైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే వెంకటేష్ తో 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' చిత్రాలు చేసిన అనిల్.. తన తదుపరి చిత్రాన్ని నటసింహం నందమూరి బాలకృష్ణతో ప్రకటించారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలతో సైతం త్వరలోనే సినిమాలు తీస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వాస్తవానికి టాలీవుడ్ లో అనిల్ రావిపూడికి భారీ ఇమేజ్ ఉంది.
పాన్ ఇండియా సినిమాలు చేయగల సత్తా కూడా ఉంది. అసలు ఆయన అడిగితే అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు వెంటనే ఓకే చెబుతారు. అయినప్పటికీ ఆయన సీనియర్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
అయితే అందుకు కారణం లేకపోలేదట. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలెవ్వరూ ఖాళీగా లేరు. మూడు, నాలుగు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టుకుని బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ల కోసం కథలు రాసుకుంటే.. రెండు, మూడేళ్లు ఎదురుచూపులు తప్ప ఇంకేమీ ఉండవు. అందుకే అనిల్ రావిపూడి స్టార్ హీరోలను పక్కన పెట్టి సీనియల్ హీరోలపై ఇంట్రస్ట్ చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.