యాక్టర్స్ అడ్డా లాంటివి మనకూ ఉంటే..!

Update: 2019-11-28 04:40 GMT
ఈమధ్య బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ అనుపమ చోప్రా 'యాక్టర్స్ అడ్డా' అనే పేరుతో కొందరు స్టార్లతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది.  ప్యానెల్ డిస్కషన్ లాంటి ఈ ఇంటర్వ్యూలో  మనోజ్ బాజ్ పాయ్.. రణవీర్ సింగ్.. దీపిక పదుకొనె.. అలియా భట్.. ఆయుష్మాన్ ఖురానా.. విజయ్ దేవరకొండ.. విజయ్ సేతుపతి.. పార్వతి తిరువొతు పాల్గొన్నారు.  ఈ ఇంటర్వ్యూకు సోషల్ మీడియాలో భారీ ఆదరణ దక్కుతోంది.

సాధారణంగా మన స్టార్ల ఇంటర్వ్యూలు అన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ తరహాలో ఉంటాయి.  వివాదాస్పద అంశాలు మాట్లాడకూడదని ముందే కండిషన్లు పెడతారు. ఇక ఇంటర్వ్యూ చేసేవ్యక్తి కూడా ఆ స్టార్ ను ఆయన వంశాన్ని పొగడడంతోనే ఇంటర్వ్యూ పూర్తిగా తెల్లారుతుంది. కొందరు యాంకర్లైతే మరీ పిట్టలదొర తరహాలో రెచ్చిపోయి మరీ ఇంటర్వ్యూలు చేస్తారు. కానీ ఈ 'యాక్టర్స్ అడ్డా' లో అలా కాకుండా ఒక అంశంపై అందరూ తమ అభిప్రాయాలను ఓపెన్ గా చెప్తారు.  విజయ్ దేవరకొండ పక్కనే ఉన్నా పార్వతి 'అర్జున్ రెడ్డి' పై విమర్శలు చేసిందంటేనే మనం ఆ ఇంటర్వ్యూ ఎంత ఓపెన్ గా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. 

ఈ ఇంటర్వ్యూను చూసిన చాలామంది మనకు తెలుగులో కూడా ఇలాంటి ప్లాట్ ఫాం ఉంటే బాగుంటుందని.. ముగ్గురు నలుగు స్టార్లు ఇలా ఓపెన్ గా చర్చలు జరిపితే ప్రాక్టికల్ గా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. లేకపోతే స్టార్ల ఇంటర్వ్యూలు సహజంగా కాకుండా.. కృత్రిమమైన పొగడ్తలతో.. స్తోత్రాలతో నిండిపోయి ఉంటాయని.. వాటిని చూడలేక చస్తున్నామని అంటున్నారు. సినీరంగం పట్ల అవగాహన కలిగిన వారయితేనే ఇలాంటి ఇంటర్వ్యూలు చేయగలరని అంటున్నారు. మరి నెటిజన్ల అభిప్రాయాలు వినేవారు నిజంగా ఎవరైనా ఉన్నారా?Full View

Tags:    

Similar News