అక్కినేని అఖిల్ కొత్త సినిమా ఈమధ్యే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అఖిల్ కెరీర్ లో హీరోగా ఇది నాలుగవ చిత్రం. జీఎ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. పెద్దగా బ్రేక్స్ లేకుండా షూటింగ్ ను చకచకా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారట. ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందట. ఇదిలా ఉంటే.. అఖిల్ తన నెక్స్ట్ సినిమాకోసం కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడని సమాచారం.
టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ రీసెంట్ గా అఖిల్ కు ఒక ఇంట్రెస్టింగ్ కథ వినిపించాడట. అఖిల్ కు నచ్చడంతో ఇద్దరి మధ్య ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలానే విషయంలో పలు మార్లు చర్చలు కూడా సాగాయట. ఈ కథ పట్ల నమ్మకం కలగడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని ప్రశాంత్ వర్మను అఖిల్ కోరడం జరిగిందట. అంతా సవ్యంగా జరిగితే #అఖిల్ 5 ఇదే కావచ్చని అంటున్నారు. ప్రాజెక్ట్ ఓకే అయితే ఈ ఏడాదే సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం.
ప్రశాంత్ వర్మ ప్రస్తుతం యాంగ్రీ స్టార్ రాజశేఖర్ తో 'కల్కి' చిత్రం రూపొందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కాగానే ప్రశాంత్ తన పూర్తి ఫోకస్ అఖిల్ చిత్రంపైనే పెడతాడట. అంతా బాగానే ఉంది కానీ ఇప్పటి వరకూ అఖిల్ సినిమా రిలీజ్ కాకమునుపు ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి ఎన్ని చర్చలు జరిగినా.. ప్రాజెక్టు ఓకే అయినా అవన్నీ ప్రెజెంట్ సినిమా రిలీజ్ తర్వాత సైడ్ కు వెళ్ళిపోతాయి. అఖిల్ మొదటి సినిమా నుండి 'Mr. మజ్ను' వరకూ అలానే జరుగుతూ వచ్చింది. సినిమా సినిమాకు మధ్య గ్యాప్ ఉంటూనే వచ్చింది మరి ఈసారైనా అఖిల్ అలా కాకుండా తన నెక్స్ట్ సినిమాను గ్యాప్ లేకుండా వెంటనే మొదలు పెట్టాలని కోరుకుందాం.