ఓవైపు సుశాంత్ సింగ్ కేసులో మాదక ద్రవ్యాల వ్యవహారం అంతకంతకు హీట్ పెంచేస్తోంది. తాజాగా రియా చక్రవర్తి ని ఆమె అనుయాయుల్ని అరెస్టు చేశారు. ఇక ఈ కేసు విషయంలో కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ అట్టుడికిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోకి ముంబై పోలీసులు సహా పలువురు నాయకులు చేరడంతో రచ్చరచ్చ అయ్యింది. బాలీవుడ్ లో ప్రముఖ స్టార్ల పేర్లను బహిరంగంగా రివీల్ చేస్తూ వారికి నార్కోటిక్స్ వాళ్లు రక్త పరీక్షలు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతకంతకు గొడవ పెద్దదైపోతోంది.
ఇక కంగన వ్యవహారంపై ఇంతకుముందు సంజయ్ రౌత్ వంటి నాయకులు సీరియస్ అయ్యారు. తాజాగా బీఎంసీ వాళ్లు కంగన అక్రమ ఇంటి కట్టడంపై కొరడా ఝలిపించేందుకు ప్రయత్నించడం హాట్ టాపిక్ గా మారింది. ఎవ్వర్ లేటెస్టుగా కంగనా రనౌత్ మాదకద్రవ్యాల వినియోగం గురించి వివరాలను పరిశీలించడానికి ముంబై పోలీసులు సిద్ధమవుతున్నారని మహారాష్ట్ర హోం మంత్రి అనీల్ దేశ్ ముఖ్ ప్రకటించడం వేడెక్కిస్తోంది.
కంగనా రనౌత్ కార్యాలయంపై బిఎంసి అధికారులు దాడి చేసిన తరువాత.. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఇప్పుడు నటి డ్రగ్ ఎపిసోడ్లను కూడా పరిశీలించాలని సూచించారు. ముంబై నగరాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) తో పోల్చిన తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం కంగనా రనౌత్ పై సీరియస్ గా ఉంది. ముంబై శివారులోని కంగనా కార్యాలయంపై బిఎంసి అధికారులు సోమవారం దాడి చేయడం సంచలనమైంది.
విలేకరులతో మాట్లాడుతూ అనిల్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ, "ఎమ్మెల్యేలు సునీల్ ప్రభు .. ప్రతాప్ సర్నాయక్ సమర్పించిన అభ్యర్థన ప్రకారం.. నేను అసెంబ్లీలో సమాధానమిచ్చాను. కంగనా రనౌత్ అధ్యాయన్ సుమన్ తో సంబంధాలు కలిగి ఉన్నానని ఒక ఇంటర్వ్యూలో ఆమె డ్రగ్స్ తీసుకోవాల్సిందిగా అతనిని బలవంతం చేసిందని చెప్పారు. దీని వివరాలను ముంబై పోలీసులు పరిశీలిస్తారని అన్నారు.
శేఖర్ సుమన్ కుమారుడు అధ్యాయన్ సుమన్ పాత ఇంటర్వ్యూలో కొకైన్ సిప్ చేయమని కంగన కోరినట్లు పేర్కొన్నాడు. మార్చి 2008 లో కంగన పుట్టినరోజున ఇలా ఆఫర్ చేసిందని అన్న వీడియో వైరల్ అయ్యింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుండి కంగనా బాలీవుడ్‌లో డ్రగ్ లింకుల గురించి విస్తృతంగా మాట్లాడారు. తన తాజా ఇంటర్వ్యూలో ఒకదానిలో దాదాపు 99 శాతం చిత్ర పరిశ్రమ ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందని క్వీన్ ఆరోపించింది. రణ్‌వీర్ సింగ్- విక్కీ కౌషల్- రణబీర్ కపూర్ లు మాదకద్రవ్య దుర్వినియోగానికి పాల్పడాలని ఆమె బహిరంగంగా వ్యాఖ్యానించడం హీటెక్కించింది.