కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్-2 ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక కేజీఎఫ్్-2 చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుండటంతో అన్ని భాషల్లోనూ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు టీం సభ్యులు.
ప్రమోషన్లలో భాగంగా రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయడానికి టీం ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 బృందం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మొత్తం పాల్గొంది. అయితే ప్రెస్ మీట్ లో కేజీఎఫ్-2 బాహుబలి కలెక్షన్లు బ్రేక్ చేస్తుందా అనే ఫ్రశ్న ఎదురైంది.
దానికి యష్ స్పందిస్తూ ఏదైనా ఒక సినిమా వస్తే అంతకు ముందు ఉన్న రికార్డులు అన్నింటినీ బ్రేక్ చేయాలి. దాన్ని ప్రొగ్రెస్ అంటారు అన్ని అన్నాడు.
ఏదో ఒక రికార్డు క్రియేట్ అయ్యిందంటే దాన్నే పట్టుకుని కూర్చోవద్దని చెప్పాడు. కలక్షన్లు, రికార్డులు ఎప్పటికప్పుడు మారుతు పోతూ ఉంటాయని ఈ సందర్భంగా తెలిపాడు. కానీ ప్రేక్షకుల ప్రేమ ఎంత ఉంది అనేదే ఎప్పుడు అతి ముఖ్యమైన అంశం అవుతుందని చెప్పాడు. ఆ దేవుడు ఏం డిసైడ్ చేస్తే అదే అవుతుందని చెప్పుకొచ్చారు.
ఓవర్సీస్ సెన్సార్ బోర్డు అభ్యర్థి ఉమైర్ సంధు.. ఈ మధ్య సౌత్ సినిమాలపై ఎక్కువగా దృష్టి సారించారు. తాను సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు రివ్యూలను కూడా ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని, అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటి వరకు ఉమైర్ ఇచ్చిన రివ్యూలు దాదాపు కరెక్టయ్యాయి. తాజాగా కేజీఎఫ్-2 కూడా ఫస్ట్ రివ్యూని ఇచ్చాడు ఉమైర్ సంధు. కేజీఎఫ్-2 మొత్తంగా ఒక యాక్షన్ థ్రిల్లర్.
ఇందులో స్టైల్, సబ్జెక్ట్ రెండింటితో పాటు ఆశ్చర్యపరిచే యాక్షన్, అద్బుతమైన విజువల్స్ కూడా ఉన్నాయని ఉమైర్ సంధు చెప్పాడు. ముఖ్యంగా యశ్ ఈ చిత్రానికి ట్రంప్ కార్డు లాగా నిలిచాడని వివరించాడు. యశ్ చరిష్మా వల్లే సినిమా ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ సినిమా ఎక్కువ కాలం నడవాలంటే మాత్రం కంటెంటే ముఖ్యమని అని చెప్పాడు. పైగా ఎక్కువ రోజులు నడిచే సత్తా కూడా సినిమాలో ఉందని తేల్చాడు.