నాని మరో ఫహద్‌ ఫాసిల్‌ అవుతాడా?

Update: 2021-10-02 23:30 GMT
ఒకప్పుడు హీరోలు నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రలు చేసేందుకు భయపడేవారు. తమ అభిమానులు నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానాలతో మంచి పాత్రలను వదులుకున్న పెద్ద హీరోలు చాలా మంది ఉన్నారు. హీరోగా రాణిస్తు విలన్ పాత్రలకు ఈమద్య కాలంలో యంగ్‌ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. బాహుబలి సినిమాలో రానా విలన్ గా నటించేందుకు ఒప్పుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. విలన్ అయినా మంచి పవర్ ఫుల్‌ రోల్ అయితే హీరో స్థాయిలో ప్రతిభ చూసే అవకాశం ఉంటుంది. కనుక విలన్‌ పాత్ర వస్తే వదనకుండా చేస్తున్న యంగ్ హీరోలు పెరిగి పోతున్నారు. ఇటీవలే ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా విలన్ గా నటించి మెప్పించాడు. మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాసిల్ ఒక వైపు ఫ్యామిలీ హీరోగా మలయాళీలను అలరిస్తూనే మరో వైపు విలన్ పాత్రలకు జీవం పోస్తూ వస్తున్నాయి. విజయ్‌ సేతుపతి కూడా తమిళంలో ఆయన కోరుకుంటే ఏడాదికి అయిదు ఆరు సినిమాలు హీరోగా చేయగలడు. కాని విలన్ పాత్రలను కూడా చేస్తూ వస్తున్నాడు.

పర భాష నుండి తీసుకుంటే వీరిద్దరు.. మన భాష నుండి తీసుకుంటే పలువురు యంగ్‌ హీరోలు విలన్ పాత్రలకు నో చెప్పకుండా ఓకే అనేస్తున్నారు. మంచి విలన్ పాత్రలు వస్తే తప్పకుండా మేము కూడా ఓకే చెప్తామని మరి కొందరు యంగ్ హీరోలు కూడా సిద్దంగా ఉన్నారు. 'వి' సినిమా లో నాని నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రను చేశాడని.. విలన్ పాత్రను చేశాడంటూ వార్తలు వచ్చాయి. అయితే నాని ఆ సినిమాలో హీరోగానే నటించాడు.. కాని జనాల్లో మాత్రం విలన్‌ అంటూ ప్రచారం జరిగింది. నాని విలన్‌ అంటూ వార్తలు వచ్చిన సమయంలో చాలా మంది ఎగ్జైట్ అయ్యారు. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు ఉన్న నాని ఎలా విలన్ గా కనిపిస్తాడు.. ఆయన నటన ఎలా ఉంటుంది అంటూ అంతా ఆసక్తి కనబర్చారు. కాని వి సినిమా లో విలన్ గా కనిపించక పోవడంతో అంతా నిరాశ వ్యక్తం చేశారు.

మళ్లీ నాని విలన్ పాత్ర కు ఓకే చెప్పాడు అనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న మీడియా వర్గాల సమాచారం ప్రకారం నాని ని వంశీ పైడిపల్లి తాను తమిళ సూపర్ స్టార్‌ విజయ్‌ తో చేయబోతున్న సినిమాకు గాను విలన్‌ పాత్రకు అడిగాడట. ఆ విషయంలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయని.. వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో పాటు విజయ్ వంటి స్టార్‌ హీరో మూవీ మరియు పాన్‌ ఇండియా మూవీ అవ్వడం వల్ల నాని ఓకే చెప్పాడు అంటూ సమాచారం అందుతోంది. ఒక వేళ నాని కనుక ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్తే.. పాత్ర ఏదైనా అది ఖచ్చితంగా మల్టీ స్టారర్ మూవీ అవుతుంది. నటుడిగా మంచి పేరు దక్కించుకున్న నాని విలన్‌ గా తన ప్రతిభను చూపించాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. అందుకే ఫహద్‌ ఫాసిల్‌ తరహాలో నాని కూడా హీరోగా.. విలన్ గా కూడా సినిమాలు చేస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News